Nellore: వైస్సార్సీపీ డైవర్షన్ పాలిటిక్స్: టీడీపీ నేత సాబీర్ ఖాన్!
Nellore: వైఎస్సార్సీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, మంత్రిగా ఉన్నప్పుడు 'ఏ' టాక్స్ వసూలు చేసిన ఘనత అనిల్ కుమార్ యాదవ్‌దేనని నెల్లూరు టీడీపీ నేత పఠాన్ సాబీర్ ఖాన్ మండిపడ్డారు.
Nellore: వైస్సార్సీపీ డైవర్షన్ పాలిటిక్స్: టీడీపీ నేత సాబీర్ ఖాన్!
నెల్లూరు: ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది ప్రజలు కూటమి ప్రభుత్వంపై నమ్మకంగా ఉన్నారు కావున రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీ కైవసం చేస్తున్నందున అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ ఉరఫ్ గొడ్డలి పార్టీ డైవర్షన్ పాలిటీస్కు తెరలైపోయింది.
ఆధారాలు లేని విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై తీవ్రంగా ఖండించిన పఠాన్ సాబీర్ ఖాన్ గత ప్రభుత్వ హయాంలో 2019 .24 మధ్యలో అనిల్ కుమార్ యాదవ్ కి ఇచ్చిన ఇరిగేషన్ శాఖ అని వదిలేసి సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కి నెల్లూరు జిల్లాలో మైనింగ్ చేస్తున్న వాళ్ళని బెదిరించి A టాక్స్ అంటే అనిల్ టాక్స్ గుంజి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి ముడుపులు ఇచ్చినది నువ్వు కాదా అనిల్ కుమార్ యాదవ్ అని విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉండి నువ్వు చేసినది అక్రమాలు దౌర్జన్యాలు బెదిరింపులకు పాల్పడటం విమర్శించిన వాళ్ళని కొట్టడం కేసులు పెట్టడం జైలకు పంపించడం నీకు అనుకూలంగా లేని వాళ్ళ ఇల్లులు కూల్చడం తప్ప నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పు అని అన్నారు.
పైగా నువ్వు చేసే తప్పుడు ఆరో ఆరోపణలకు బదులుగా సమాధానం ఇవ్వడం కోసం మీ పార్టీలో ఉన్న మైనార్టీలను ఎస్సీలను చెప్పి తెలుగుదేశం వాళ్లను తిట్టించి వాళ్ళని బలి పశువులు చేస్తున్నావు అని అన్నారు మొదటినుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను ఎస్సీ ఎస్టీలను బీసీలను బలి పశువులను చేసే పార్టీ వైసీపీ అని అన్నారు.
నువ్వు చెన్నైలో విల్లా కట్టుకొని ఉన్నావు కదా తమిళనాడు రాష్ట్రంలో అనిల్ అనే పదానికి ఒక అర్థం ఉంది ముందు అది తెలుసుకో తమిళనాడులో అనిల్ ని ఉడతా అని పిలుస్తారు మా నాయకులపై చేసే విమర్శలు ఉడుత బెదిరింపు లాంటిది ఇక్కడ ఎవరు వాటికి భయపడరు అని అన్నారు.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రి ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కలిసికట్టుగా ఉన్నారు. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లాగా అంతర్గత కలహాలు లేవు అందులో నీకు జిల్లాలో ఎంట్రీ ఏ లేదు నెల్లూరు రూరల్ లో వెళ్తే విజయ్ కుమార్ రెడ్డి ఒప్పుకోరూ సిటీ లో వెళ్తే చంద్రశేఖర్ రెడ్డి ఒప్పుకోరు నెల్లూరు జిల్లాకు వస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి ఒప్పుకోరూ ఇవన్నీ వదిలేసి పెన్నా దాటి ఒక మాజీ మంత్రి మనిషి చూస్తే పర్సనాలిటీ నోరు చూస్తే మున్సిపాలిటీ అని పిలవబడే ప్రసన్నకుమార్ రెడ్డి చెంత చేరావు అని అన్నారు.
ఈ నెల్లూరు జిల్లాలో ఒక మహిళ జీవిత కాలం అనేక కష్టాలు ఎదుర్కొని కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ప్రసన్న కుమార్ రెడ్డిని చిత్తుచిత్తుగా తుక్కుతుక్కుగా ఓడించిన నీకు సిగ్గు రాలేదు ప్రసన్ కుమార్ రెడ్డి ఆ మెజారిటీని చూసి నీకు మైండ్ దొబ్బి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావ్ అని అన్నారు.
ఈ జిల్లాలో ఎంట్రీ లేని అనిల్ కుమార్ యాదవ్ కి ఏదో ఒక సందర్భంలో రావడం ఏదో ఒక అలిగేషన్ లేపి ఆధారాలు లేని ఆరోపణలు చేయడంతో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలలు పట్టుకునే పరిస్థితుల్లో దిగజారిన అనిల్ కుమార్ యాదవ్ అని అన్నారు.




