Nellore: నేలటూరు జెట్టీ పనులు త్వరలోనే పూర్తి సోమిరెడ్డి

Nellore: నేలటూరు జెట్టీ అసంపూర్తి పనులను త్వరలోనే పూర్తి చేయిస్తామని, రూ.1.20 కోట్ల విలువైన డీప్ సీ బోట్లను సబ్సిడీపై పొందాలని తెలిపిన ఎమ్మెల్యే సోమిరెడ్డి.

V. Narasimhulu, Nellore
Published on: 8 Aug 2026 9:02 PM IST
Nellore
X

Nellore: నేలటూరు జెట్టీ పనులు త్వరలోనే పూర్తి సోమిరెడ్డి

నెల్లూరు: నుడా నిధులతో తీర ప్రాంతంలో హైమాక్స్ లైట్లు, నేలటూరు జెట్టీ అసంపూర్తి పనులను త్వరలోనే పూర్తి చేయిస్తామని చెప్పారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రూ.1.20 కోట్ల విలువైన హైస్పీడ్ బోటును రూ.48 లక్షలకే పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నెల్లూరులోని హోటల్ విశ్రాంత్ లో మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో జరిగిన శిక్షణ తరగతుల్లో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.....

రాష్ట్రంలో 21 ఏళ్లుగా ఏడు రకాల అంశాలపై మత్స్యకార సంక్షేమ సమితి పనిచేయడం అభినందనీయమన్నారు...107 గ్రామాల నుంచి, 300 మంది సంప్రదాయ దుస్తులతో ఈ కార్యక్రమానికి హాజరుకావడం సంతోషం అని అన్నారు. మత్స్యకారుల సమస్యలను కోలంగారి పోలయ్య ఎప్పటికప్పుడు తన దృష్టికి తెస్తుంటారని,

కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. వేట నిషేధ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేలు మత్స్యకార సేవలో పేరుతో అందిస్తోందని చెప్పారు. ప్రమాద బీమాగా రూ. 5 లక్షలతో పథకం అమలు చేస్తోందని, నేలటూరు జెట్టీ అసంపూర్తి పనులను పూర్తి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాని చెప్పారు.

అదానీ కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలోనే మిగిలిన పనులు పూర్తి చేయించేందుకు ప్రయత్నిస్తున్నామని, రూ.1.20 కోట్ల విలువైన డీప్ సీ బోట్లను 40 శాతం సబ్సిడీపై ప్రభుత్వం మత్స్సకారులకు అందజేస్తోందని తెలిపారు. మత్స్యకారులు ముందుకొస్తే సీఎస్ఆర్ నిధులను వినియోగించుకుని 60 శాతం సబ్సిడీ అందించేలా ఇటీవల జరిగిన ఓ సమావేశంలో హిమాన్షు శుక్లాతో చర్చించామని చెప్పారు. రూ.1.20 కోట్ల విలువైన బోటు కేవలం రూ.48 లక్షలకే పొందే అవకాశం ఉందని, అతితక్కువ పెట్టుబడితో డీప్ సీ బోట్లు పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మత్స్యకారులను కోరుతున్నట్లు ఆయన చెప్పారు.

అధ్వానంగా మారిన కోడూరు బీచ్ రోడ్డు పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొదలు పెట్టించామని, కోడూరు బీచ్ తో పాటు వేళాంగిణి చర్చి భక్తులు, మత్స్యకార గ్రామాలకు ఈ రోడ్డు ఎంతో ఉపయోగకరంగా మారనుందని చెప్పారు. వేటకు వెళ్లే వచ్చే మత్స్యకారుల కోసం వెంకన్నపాళెం తీరంలో హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేయించాలని స్థానికులు కోరారు..నుడా నిధులతో ఆ లైట్లు ఏర్పాటు చేయించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.

మిగిలిన మత్స్యకార గ్రామాల్లోనూ అవసరమైన చోట హైమాక్స్ లైట్లు వేయించేందుకు సిద్ధంగా ఉన్నామని, బీపీసీఎల్ పైపు లైను వేసే సమయంలోనూ రెండు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కృష్ణపట్నం మత్స్యకారులకు పరిహారం ఇప్పించామని చెప్పారు. కృష్ణపట్నంలో ఆలయ నిర్మాణానికి కూడా అవసరమైన చర్యలు చేపట్టామని ,మత్స్యకారుల సమస్యలపై ఎప్పుడూ రాజీ లేకుండా కృషి చేస్తున్నానని చెప్పారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story