Nellore: సంగం మండలం దివ్యాంగుడికి ట్రై సైకిల్ పంపిణీ!

Nellore: నెల్లూరు జిల్లా సంగం మండలం జంగాల కండ్రికలో టీడీపీ నేత ముత్యాల విజయ్ చంద్ర దివ్యాంగుడికి ట్రై సైకిల్ పంపిణీ చేశారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 24 Aug 2026 4:45 PM IST
Nellore
X

Nellore: సంగం మండలం దివ్యాంగుడికి ట్రై సైకిల్ పంపిణీ!

నెల్లూరు: నెల్లూరు జిల్లా సంగం మండలం జంగాల కండ్రిక గ్రామంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే క్రమంలో ఇంటింటికి వెళ్లినప్పుడు గుర్తించిన సమస్యల పరిష్కారంపై టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి ముత్యాల విజయ్ చంద్ర ప్రత్యేక దృష్టి సారించారు.

ఇటీవల గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో జయమంగళం మహేష్ అనే దివ్యాంగుడికి కుటుంబం దూరమై సహాయం చేసే వారు లేక దిక్కు తోచని స్థితిలో ఉండటం తో విజయ్ చంద్ర స్పందించి ముత్యాల ప్రమీల మల్లికార్జున చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగుడికి ట్రై సైకిల్‌ను అందజేశారు.

అదేవిధంగా దివ్యాంగుడికి 15 వేల పింఛన్ పొందేందుకు అవసరమైన మెడికల్ సర్టిఫికెట్ లేకపోవడంతో, సమస్య పరిష్కారం కోసం విజయ్ చంద్ర స్వయంగా జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ దగ్గరకు వెళ్లి వినతిపత్రం అందజేశారు.

మెడికల్ సర్టిఫికెట్ మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే గ్రామంలోని ఎస్సీ కాలనీలో పలువురు నిరుపేద మహిళలను గుర్తించి వారికి చీరలను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, సాధ్యమైనంత వరకు తక్షణ పరిష్కారానికి కృషి చేస్తున్న ముత్యాల విజయ్ చంద్రను గ్రామస్థులు అభినందించారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story