Nellore: నెల్లూరు రూరల్‌లో ప్రజాదర్బార్ హాజరైన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి!

Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. వినతులు స్వీకరణ.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 14 Aug 2026 5:16 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు రూరల్‌లో ప్రజాదర్బార్ హాజరైన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి!

Nellore: నేటి ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి... ప్రతి రోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని చెప్పారు.. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు.... ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.

కావున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామని చెప్పారు.... వివిధ సమస్యలతో వస్తున్న ప్రజా సమస్యల పరిష్కారం వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని,.. ప్రజల సూచనలు, సలహాల మేరకే నెల్లూరు రూరల్ లో అభివృద్ధి పనులు సాగుతున్నాయని చెప్పారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి , ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జిలు జలదంకి సుధాకర్, కంటే సాయి బాబా, నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, కో క్లస్టర్ ఇంచార్జిలు కుంచనపల్లి శివ కుమార్, ఖాదర్ భాష, మండల టీడీపీ కన్వీనర్ పముజుల ప్రదీప్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ గ్రీవెన్స్ సెల్ ఇంచార్జ్ మంగళపూడి భాస్కర్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ యువత అధ్యక్షుడు నందిపాటి శ్యామ్, టీడీపీ నాయకులు సాజిద్, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొనారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story