Nellore: 20 వేల మంది జెన్‌జీ యువతతో ఎమ్మెల్యే కోటంరెడ్డి ముఖాముఖి

Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 20 వేల మంది జెన్‌జీ యువతతో 51 ఆత్మీయ భేటీలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడి.

V. Narasimhulu, Nellore
Published on: 24 Aug 2026 3:44 PM IST
Nellore
X

Nellore: 20 వేల మంది జెన్‌జీ యువతతో ఎమ్మెల్యే కోటంరెడ్డి ముఖాముఖి

నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి... నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 20 వేల మంది జెన్‌జీ యువతతో నేరుగా ముఖాముఖి మాట్లాడాలని, మొత్తం 51 అత్మీయ భేటీలు రాబోయే రోజుల్లో నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు.

రేపు ఉదయం 10 గం॥లకు పార్ధసారధి నగర్‌లోని జెనెక్స్ కాలేజీలో 10 గం॥లకు ప్రారంభ కార్యక్రమం ఉంటుందని, యువత ఆలోచనలు, ఆకాంక్షలు, సూచనలు తెలుసుకుంటూ, ఓ ఎమ్.ఎల్.ఏ.గా తాను నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఏమిచేసింది, భారత ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో యన్.డి.ఏ. ప్రభుత్వం దేశానికి ఏమి చేస్తున్నది.

చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి రాష్ట్రానికి ఏమి చేస్తున్నది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలు, యువనేత నారా లోకేష్ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాల కల్పన కోసం చేస్తున్న కృషిని వివరిస్తూ ముందుకు సాగుతానని చెప్పారు.

విద్యార్ధుల దగ్గర నుంచి సూచనలు, సలహాలే కాకుండా సద్విమర్శలను సైతం స్వాగతిస్తానని, అంతిమంగా విద్యార్ధులతో ఓ ఎమ్.ఎల్.ఏ.గా కాకుండా కుటుంబ సభ్యుడిగా కలసి మెలసి యువతతో మాట-మంతి కార్యక్రమం ఉంటుందని చెప్పారు. మాటమంతి కార్యక్రమంలో బహిరంగంగా మాట్లాడలేని వారికి నా ఫోన్ నంబర్, మెయిల్ ఐడి ద్వారా నాతో చర్చించవచ్చునని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story