Nellore: ఎన్నికలు అయిపోయాయి.. ఇప్పుడు అభివృద్ధి సమయం: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
Nellore: నెల్లూరు రూరల్ పరిధిలోని కందమూరు, ఉప్పుటూరు గ్రామాల్లో రూ. 25 లక్షలతో సీసీ రోడ్ల ప్రారంభం.
Nellore: ఎన్నికలు అయిపోయాయి.. ఇప్పుడు అభివృద్ధి సమయం: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కందమూరు మరియు ఉప్పుటూరు గ్రామాలలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాజీ. ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికలు లేని వేళ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తామని చెప్పారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ మండలాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కందమూరు మరియు ఉప్పుటూరు గ్రామల అభివృద్ధికి 6 కోట్ల 57 లక్షల రూపాయలు నిధులు కేటాయించామని చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి మరియు కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరారు. నెల్లూరు రూరల్ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, యువ నేత, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ కి, జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డికి, టిడిపి పార్లమెంటరీ అధ్యక్షులు శాసనమండల సభ్యులు బీద రవిచంద్ర కి నెల్లూరు రూరల్ ప్రజలపక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంఛార్జ్ జలదంకి సుధాకర్, టీడీపీ మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇంఛార్జ్ వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి, టిడిపి నాయకులు చెరుకూరు చిన్న పెంచల నాయుడు, చెరుకూరు పెద్ద పెంచల నాయుడు, చెరుకూరు సింహాద్రి నాయుడు, మధు, రామానాయుడు, ఈశ్వరయ్య, ఎం.ప్రసాద్, పెంచలయ్య , మహేశ్వర్, ఏడుకొండలు, రఘురామయ్య, ప్రసాద్, లోకేష్, మస్తాన్, కిష్టయ్య, పట్టాభి, ఉప్పుటూరు గ్రామ మాజీ సర్పంచ్ అంబటి వెంకటసుబ్బారెడ్డి, రాపూరు పెంచలయ్య, రాపూరు పెంచల బాబు, అంబటి శ్రీనివాసులు రెడ్డి, గుద్దటి సుధీర్ రెడ్డి, ఉప్పుటూరు రెడ్డి, గుంజి సుబ్బయ్య, బేతాళం మురళి, రాపూరు హరిబాబు, సుంకర సీనయ్య, మదనపల్లి శివయ్య,రాపూరు మస్తానయ్య, రాపూరు మురళి, బెల్లంకొండ చెంచురత్నం, బెల్లంకొండ చెంచయ్య, రాపూరు వెంకట కృష్ణయ్య, గుర్రంకొండ రవీంద్ర, అచ్చి పెంచలయ్య, బెల్లంకొండ వెంకటరత్నం, గుంజి రాదయ్య, తానికొండ వెంకటేష్, తానికొండ తిరుమలేష్, రాము మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




