Nellore: నెల్లూరులో రౌడీషీటర్ ‘కమ్మసాయి’ దారుణ హత్య బండరాయితో మోది!

Nellore: నెల్లూరు ఆర్టీవో ఆఫీస్ సమీపంలో రౌడీషీటర్ లక్ష్మీ శెట్టి సాయితేజ అలియాస్ కమ్మసాయి దారుణ హత్య. వెంటాడి బండరాయితో మోదిన దుండగులు, వేదయపాలెం కేసు నమోదు.

A Praveen, Nellore
Published on: 31 Aug 2026 11:11 AM IST
Nellore
X

Nellore: నెల్లూరులో రౌడీషీటర్ ‘కమ్మసాయి’ దారుణ హత్య బండరాయితో మోది!

Nellore: నెల్లూరు నగరం మరోసారి ఉలిక్కిపడింది. రాత్రివేళ హర్రర్ సినిమాని తలపిస్తూ కొందరు గుర్తు తెలియని దుండగులు లక్ష్మీ శెట్టి సాయి తేజ అలియాస్ కమ్మసాయి అనే రౌడీషీటర్ ను అత్యంత వాసివికంగా కిరాతకంగా వెంటాడి వేటాడి హత్య చేశారు. దుండగులు వెంటాడడంతో కొంత దూరం పరిగెత్తి ఆర్టీవో ఆఫీస్ సమీపంలో కుప్పకూలిన రౌడీ షీటర్ కమ్మసాయి తలపై బలమైన బండరాయితో మోది హతమార్చారు.

మృతుడు లక్ష్మీ శెట్టి సాయి తేజ అలియాస్ కమ్మసాయి నగరంలోని చంద్రమౌళి నగరకు చెందిన యువకుడు. ప్రశాంతమైన ఆర్టీవో ఆఫీస్ సమీపంలో జరిగిన దారుణ హత్యతో ఆ ప్రాంతం తీవ్ర కలవరపాటుకు గురైంది. మధ్య జరిగిన ప్రాంతం నుంచి అజ్ఞాత వ్యక్తులు 112 కి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

నగర ఇన్చార్జి డిఎస్పి గిరిధర్ తో పాటు రూరల్ డిఎస్పి హరినాథ్ నగరంలోని ఐదు స్టేషన్ల పరిధిలోని సిఐలు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్.. సహా ప్రధాన నేర పరిశోధనా విభాగాలకు చెందిన అధికారులు హత్య జరిగిన ప్రాంతానికి చేరుకొని సమాచారం సేకరిస్తున్నారు.

వేదయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు ఇన్చార్జి డిఎస్పి గిరిధర్ తెలిపారు. రౌడీ షీటర్ కమ్మ సాయిని హతమార్చిన వారికోసం ప్రత్యేక బృందాలు వేట సాగిస్తున్నాయని ఆయన చెప్పారు. మృతుడు లక్ష్మీ శెట్టి సాయి తేజ పై పలు నేరాలు, హత్య కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని, పీడీ యాక్ట్ పై జైల్లో ఉన్న కమ్మసాయి ఇటీవలే విడుదలైనట్లు తమకు సమాచారం ఉందన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story