Nellore: భారీ గాలులకు నేలకూలిన భారీ వృక్షాలు.. విరిగిపోయిన 3 కరెంట్ స్తంభాలు
Nellore: నెల్లూరులో గంటకు 70 కిమీ వేగంతో వీచిన ఈదురు గాలుల బీభత్సం. మంత్రి నారాయణ ఆదేశాలతో రంగంలోకి కూటమి శ్రేణులు, మున్సిపల్-విద్యుత్ సిబ్బంది.
Nellore: భారీ గాలులకు నేలకూలిన భారీ వృక్షాలు.. విరిగిపోయిన 3 కరెంట్ స్తంభాలు
Nellore: నెల్లూరు నగరంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.. గంటకు అరవై నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు ఒక్కసారిగా రావడంతో.. భారీ వృక్షాలు నేలకొరిగాయి.. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి.. ఫ్లెక్సీలు గాలికి ఎగిరిపోయాయి.. ఓ గంటసేపు గాలి బీభత్సం సృష్టించింది.. ఈ నేపథ్యంలో
గంటల వ్యవధిలోనే మంత్రి పొంగూరు నారాయణ సూచనలతో సహాయక చర్యల లో కలిసి కూటమి నాయకులు, మున్సిపల్–విద్యుత్ శాఖ సిబ్బంది తో జనసేన నాయకుడు కిషోర్ గునుకుల చురుకైన స్పందన.. మధ్యాహ్నం లోపు విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
రామ్ జీ నగర్ 9వ వీధి, (పదహారవ) 20వ డివిజన్, నెల్లూరు సిటీలో నేడు ఉదయం భారీ గాలుల కారణంగా, భారీ వృక్షం నేలకూలి విద్యుత్ వైర్లపై పడటంతో పాటు దాదాపు మూడు విద్యుత్ స్తంభాలు విరిగిపోయి, ఒక కారుకు నష్టం కలిగింది. అదేవిధంగా చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే స్థానిక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో తక్షణమే స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదకరంగా ఉన్న చెట్టును గంటల వ్యవధిలోనే తొలగించి, విరిగిపోయిన విద్యుత్ స్తంభాల మరమ్మతు పనులు వేగంగా చేపట్టారు. ఈరోజు మధ్యాహ్నం లోపలే విద్యుత్ సరఫరాను యథావిధిగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు.
ఈ సహాయక చర్యల్లో కిషోర్ గునుకు పాల్గొని, స్థానిక ప్రజలకు త్వరితగతిన ఉపశమనం కలిగించేలా కృషి చేశారు. నగరంలోని ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు ఎదురైనా కూటమి నాయకులు అందరూ సమన్వయంతో స్పందించి పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా పొంగూరు నారాయణ గారి మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖ సిబ్బంది వేగవంతమైన స్పందనపై స్థానిక ప్రజలు అభినందనలు వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోనే పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ, పొంగూరు నారాయణ గారికి, కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ మరియు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.




