Nellore: నెల్లూరు కాలుష్య రహిత 'ఈ-ఆటో'ల ప్రారంభం

Nellore: నెల్లూరులో 101 ఈ-ఆటోలను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం. నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు ఈ సర్వీసులు దోహదపడతాయని వెల్లడించిన ప్రజాప్రతినిధులు.

V. Narasimhulu, Nellore
Published on: 18 July 2026 7:12 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు కాలుష్య రహిత 'ఈ-ఆటో'ల ప్రారంభం

నెల్లూరు: ఏపీలో తొలిసారిగా ప్రభుత్వం ప్రారంభించిన "ఈ" ఆటోలు నెల్లూరు నగరపాలక సంస్థకు అందుబాటులోకి వచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ వర్చువల్ విధానంలో ఈ ఆటోలను ప్రారంభించారు. నెల్లూరు నగరంలో తొలిసారిగా తొలి దశలో 101 'ఈ' ఆటోలను స్థానిక నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి... ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ లు స్థానిక 'ఈ' ఆటోలను ప్రారంభించారు.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యం, పర్యావరణ సమతుల్యం, దెబ్బతింటున్న నేపథ్యంలో... నెల్లూరు నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు 'ఈ' ఆటోలు ఉపయోగపడతాయని, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. నెల్లూరు నగర వాసులు ఈ ఆటోల సర్వీసులు ఉపయోగించుకొని, కాలుష్య చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దే ప్రభుత్వ సంకల్పానికి, తోడ్పాటు అందించాలని ఆయన కోరారు.

'ఈ' ఆటోల ద్వారా నగరం, భవిష్యత్తులో మరింత పరిశుభ్రంగా.. కాలుష్య రహితంగా మారే అవకాశం ఉందని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి చెప్పారు. మళ్లీ దశలో నెల్లూరు నగరానికి మరో 99 "ఈ" ఆటోలు అందుబాటులోకి వస్తాయని నగరపాలక సంస్థ కమిషనర్ వైఓ నందన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story