Nellore: నెల్లూరులో ఉచిత కంటి, దంత వైద్య శిబిరం.. నేత్రదానంపై అవగాహన!
Nellore: నెల్లూరు స్టోన్ హౌస్ పేట BVS స్కూల్‌లో నారాయణ నేత్ర జ్యోతి ఉచిత వైద్య శిబిరం. రూ.3 కోట్ల విలువైన మొబైల్ వ్యాన్ ద్వారా కార్పొరేట్ సేవలు, కంటిదానంపై అవగాహన.
Nellore: నెల్లూరులో ఉచిత కంటి, దంత వైద్య శిబిరం.. నేత్రదానంపై అవగాహన!
Nellore: నెల్లూరు నగరంలోని 7వ డివిజన్, స్టోన్ హౌస్ పేట BVS మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో నారాయణ నేత్ర జ్యోతి మరియు నారాయణ దంత సురక్ష ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు.. డాక్టర్ పొంగూరు నారాయణ గారి సొంత నిధులతో, 3 కోట్ల విలువైన ఆధునిక పరికరాల మొబైల్ వ్యాన్ ద్వారా కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సేవలను ప్రజలకు అందిస్తున్నారు. ఈ క్యాంప్‌లో ఉచిత కంటి, దంత పరీక్షలతో పాటు విద్యార్థులకు కంటిదానంపై ప్రత్యేక అవగాహన కల్పించారు.
ప్రజల వర్కింగ్ అవర్స్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు నారాయణ హాస్పిటల్ కంటి విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సుధా, డివిజన్ కార్పొరేటర్ మల్యాద్రి తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో పాటు పాఠశాలల్లోనూ సీనియర్ డాక్టర్లతో ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారని. ఇప్పటివరకు 12,200 మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు పూర్తి చేసి, పరీక్షించిన 2 రోజుల్లోనే 6,900 మందికి పైగా ఉచితంగా నాణ్యమైన కంటి అద్దాలు పంపిణీ చేశారన్నారు.
అలాగే 250 మందికి పైగా ఉచితంగా క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు... రూపాయి ఖర్చు లేకుండా లభిస్తున్న ఈ కార్పొరేట్ వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ శిబిరంలో భాగంగా BVS మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు, యువతకు కంటిదానం విశిష్టతపై ప్రత్యేక అవగాహన కల్పించారు.
చిన్న వయసు నుంచే నేత్రదానంపై అవగాహన పెంచుకోవాలని, అంధత్వాన్ని నివారించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డాక్టర్లు సూచించారు. అలాగే డయాబెటిక్ రెటినోపతి, గ్లాకోమా వంటి దీర్ఘకాలిక సమస్యల నివారణపై స్పష్టత ఇచ్చారు. ఈ కార్యక్రమంలో AGM శేఖర్ రెడ్డి, కిన్నెర సాగర్, స్థానిక టిడిపి నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.




