Nellore: మా జీతాలు మాకు ఇయ్యండి.. నెల్లూరు వెహికల్ షెడ్ వద్ద కార్మికుల ఆందోళన

Nellore: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్మికుల ఆందోళన. సమ్మె కాలం జీతాలు, బకాయిల చెల్లింపు కోసం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా.

V. Narasimhulu, Nellore
Published on: 27 April 2026 11:07 AM IST
Nellore
X

Nellore: మా జీతాలు మాకు ఇయ్యండి.. నెల్లూరు వెహికల్ షెడ్ వద్ద కార్మికుల ఆందోళన

Nellore: చెత్త తరలించే వాహనాల ప్రైవేటీకరణ ఆపాలి. సమ్మె కాలం జీతం మరియు జీతాలు బకాయిలు వెంటనే ఇవ్వాలని, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ షెడ్ వద్ద వాహనాలు నిలిపివేసి సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు డ్రైవర్లు మరియు పారిశుధ్య కార్మికులు. కమిషనర్ అకౌంట్లో 1వ తేది జీతం పడింది కాబట్టి ఆయనకి ఇబ్బందులు తెలియడం లేదంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో జీతాలు చెల్లించారని, ఒక్క నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రమే జీతాలు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె కాలం జీతం చెల్లించాలని జీవో ఉన్నప్పటికీ ఆరు నెలల నుండి కాలయాపన చేస్తున్నారని, అధికారుల నిర్లక్ష్య వైఖరి విడనాడి, చిన్న జీతాలపై ఆధారపడిన కార్మికుల ఇబ్బందులు పరిష్కరించాలని , ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) డిమాండ్ చేశారు. యూనియన్ నాయకులతో చర్చలు జరిపారు డిఈ రఘురాం. సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు కార్మికులు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story