Nellore: నెల్లూరులో మిస్ట్ మిషన్ ప్రారంభం.. స్వయంగా పరిశీలించిన మంత్రి
Nellore: నెల్లూరు నగరంలో పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ కోసం అత్యాధునిక ‘మిస్ట్ మిషన్’ అందుబాటులోకి వచ్చింది.
Nellore: నెల్లూరులో మిస్ట్ మిషన్ ప్రారంభం.. స్వయంగా పరిశీలించిన మంత్రి
Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పచ్చదనం తో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం అత్యాధునిక సాంకేతికతతో కూడిన ‘మిస్ట్ మిషన్’ రంగంలోకి దిగింది. నగరంలోని 14వ డివిజన్ ఏసీ నగర్ మల్లెల సంజీవయ్య ప్రాంగణంలో ఈ బహుళ ప్రయోజన మిషన్ పనితీరును రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిషన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
"మిస్ట్ మిషన్" ద్వారా రోడ్డు డివైడర్ల మధ్య ఉన్న మొక్కలపైకి అత్యంత వేగంగా నీటి తుంపర్లను విరజిమ్మి, వాటిపై పేరుకుపోయిన దుమ్ము, ధూళిని పూర్తిగా వదిలించవచ్చన్నారు. దీనివల్ల మొక్కలు పచ్చగా, కళకళలాడుతూ ఎదుగుతాయని తెలిపారు. కేవలం మొక్కలకు జీవజలాన్ని అందించడమే కాకుండా, నగర రోడ్లను శుభ్రం చేయడానికి, వేసవిలో గాలిలోని వేడిశాతాన్ని తగ్గించి చల్లబరచడానికి ఈ యంత్రం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వీటన్నింటితో పాటు నగరంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, తక్షణమే నీటిని వెదజల్లి మంటలను అదుపు చేసే ప్రత్యేక అత్యవసర సౌకర్యం కూడా ఈ మిషన్లో ఉందన్నారు.నగరవ్యాప్తంగా ఇలాంటి అత్యాధునిక సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించబోతున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మేయర్ సుజాతా అశోక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, అడిషనల్ కమీషనర్ హిమబిందు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనూరాధ, మాజీ జెడ్పిటిసి విజేతా రెడ్డి, కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు, టీడీపీ డివిజన్ నాయకులు పాల్గొన్నారు.




