Nellore: నెల్లూరులో ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి నారాయణ భూమి పూజ
Nellore: నెల్లూరు 50వ డివిజన్ బుజ్జమ్మ రేవు వద్ద సిద్ధి వినాయక ఆలయ పునఃనిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి నారాయణ దంపతులు. రూ. 40 లక్షలతో అభివృద్ధి.
Nellore: నెల్లూరులో ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి నారాయణ భూమి పూజ
నెల్లూరు: 50 వ డివిజన్ బుజ్జమ్మ రేవు వద్ద, సిద్ధి వినాయక ఆలయ పునఃనిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రి నారాయణ దంపతులు. మంత్రి దంపతులకు ఘన స్వాగతం పలికారు కపిర దంపతులు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ....
40 లక్షలతో ఆలయ పునః నిర్మాణానికి శంకుస్థాపన చేయటం జరిగిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందించానని చెప్పారు.
ఆలయ నిర్మాన పనులు త్వరిత గతిన పూర్తికావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.రజకుల ఆకాంక్ష మేరకు ఈ ప్రాంత ధోబీఘాట్ ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈకార్యక్రమంలో మేయర్ సుజాత,కమిషనర్ నందన్,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్,రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాసులు,నగర టీడీపీ మహిళావిభాగం అధ్యక్షురాలు కపిర రేవతి,మాజీ జెడ్పిటిసి విజేతా రెడ్డి,డివిజన్ ప్రెసిడెంట్ సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు.




