Nellore: నెల్లూరులో వైభవంగా చండీ హోమం పాల్గొన్న మంత్రి పొంగూరు నారాయణ!

Nellore: నెల్లూరు జగదీశ్ నగర్‌లో శ్రీ చండీ హోమం, లలితా సహస్రనామ పారాయణంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. 1108 మంది మహిళలతో మహా పారాయణం నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Aug 2026 1:52 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో వైభవంగా చండీ హోమం పాల్గొన్న మంత్రి పొంగూరు నారాయణ!

నెల్లూరులో ఘనంగా చండీ హోమం.. పాల్గొన్న మంత్రి నారాయణ

నెల్లూరు నగరంలోని జగదీశ్ నగర్‌లో అత్యంత వైభవంగా నిర్వహించిన మహా రుద్రాభిషేకం, చండీ హోమం, లలితా సహస్రనామ పారాయణంలో రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. యాగ స్థలానికి విచ్చేసిన మంత్రికి యాగ నిర్వాహక కమిటీతో పాటు టీడీపీ, జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఆధ్యాత్మిక ఘట్టంలో పాల్గొనడం తన పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నానని, వరుసగా 18వ సంవత్సరం ఈ మహాయాగాన్ని నిర్వహిస్తున్న భువనగిరి సుబ్బయ్య స్వామికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఏకకాలంలో 1108 మంది మహిళలు లలితా సహస్రనామ పారాయణం చేయడం అత్యంత అరుదైన ఆధ్యాత్మిక ఘట్టమని, లోక కళ్యాణం మరియు కుటుంబ సౌఖ్యం కోసం చేసే ఈ యాగాలు సమాజంలో సానుకూల శక్తిని, యువతలో నైతిక విలువలను పెంపొందిస్తాయని చెప్పారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం ప్రపంచానికే ఆదర్శమన్న మంత్రి.. భక్తి ఉన్న చోట శాంతి, ధర్మం ఉన్న చోట అభివృద్ధి ఉంటాయని పేర్కొంటూ, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్,స్థానిక టీడీపీ నేతలు సాయిరాం,యశ్వంత్ రెడ్డి,జననసేన నేతలు గుణుకుల కిషోర్,విజయలక్ష్మి,కార్య్యక్రమ కమిటీ సభ్యులు రవికుమార్,నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story