Nellore: అన్నా క్యాంటీన్‌లో మంత్రి నారాయణ కుమార్తె షరణి సందర్శన!
Nellore: నెల్లూరు తడికలబజార్ అన్నా క్యాంటీన్‌లో మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె షరణి రూ.5 టోకెన్ తీసుకుని సాధారణ ప్రజలతో కలిసి భోజనం చేశారు.
Nellore: అన్నా క్యాంటీన్‌లో మంత్రి నారాయణ కుమార్తె షరణి సందర్శన!
నెల్లూరు: నెల్లూరు నగరంలోని తడికలబజార్ సెంటర్‌లో ఉన్న అన్నా క్యాంటీన్‌ను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ కుమార్తె పొంగూరు షరణి ప్రత్యేకంగా సందర్శించారు. ముందుగా కౌంటర్ దగ్గర 5 రూపాయల టికెట్ టోకెన్ తీసుకొని, వరుస క్రమంలో నిలబడి భోజనం తీసుకున్నారు.
క్యాంటీన్‌లో అందిస్తున్న భోజన నాణ్యతను, రుచిని ఆమె స్వయంగా తిని పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు చాలా బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, ఐదు రూపాయలకే కడుపునిండా పౌష్టికాహారం లభించడం పేదలకు, సామాన్యులకు కొండంత అండగా నిలుస్తుందని హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం అక్కడికి వచ్చిన సామాన్య ప్రజలతో కలిసి షరణి భోజనం చేశారు. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యురాలు తమతో కలిసి భోజనం చేయడమే కాకుండా, తమ క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకోవడంతో పేద ప్రజలు తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు.
ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలనే ఉన్నతాశయంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లు ఎందరో దినసరి కూలీలకు ప్రాణధారగా మారాయని అక్కడ భోజనం చేస్తున్న స్థానికులు సంతోషంగా కొనియాడారు.




