Marripadu: మర్రిపాడులో చెరువు కబ్జా కలకలం.. చోద్యం చూస్తున్న అధికారులు!

Marripadu: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పోలిరెడ్డిపల్లి చెరువులో 10 ఎకరాలకు పైగా శిఖం భూమి కబ్జాకు గురవుతుండటంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 8 Sept 2026 4:59 PM IST
Marripadu
X

Marripadu: మర్రిపాడులో చెరువు కబ్జా కలకలం.. చోద్యం చూస్తున్న అధికారులు!

Marripadu: పచ్చని పంట పొలాలకు సాగునీరు అందించే చెరువు నేడు కబ్జాకు గురిచేస్తూ నడి చెరువులో నయా దందా నడిపిస్తున్నారు కొందరు బడాబాబులు.దీంతో చెరువు పరిధిలోని పంట భూములు పచ్చని పైరులతో కళకళలాడే పరిస్థితులు క్రమంగా కనమరుగయ్యే దుస్థితి నెలకొంటుంది.

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల పరిధిలో భూముల ధరలు రోజు రోజుకు పెరగుతుండడంతో సులభంగా సంపాదించడానికి అలవాటు పడిన కొంతమంది దళారులు ప్రభుత్వ భూములను కూడా యధేచ్చగా కబ్జా చేస్తున్నారు. కాగా ప్రభుత్వ ఇరిగేషన్ భూములను కాపాడడానికి చర్యలు తీసుకోవాల్సిన ఇరిగేషన్ అధికారులు చేష్టలుడిగి చోద్యం చూస్తున్నారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.

ఈ క్రమంలో మండల కేంద్రమైన మర్రిపాడు పరిధిలో చినమాచునూరు పంచాయితీ రెవిన్యూ లోని పోలీరెడ్డిపల్లి చెరువు శిఖం భూమిని ఒక రైతు తన ఇష్టారీతిగా కబ్జా చేస్తున్నట్లు గ్రామస్తులు పరిసర ప్రాంతాల రైతులు ఆరోపిస్తున్నారు. పోలీరెడ్డిపల్లి చెరువు శిఖం 54.27 ఎకరాలు కాగా ఆయకట్టు 150 ఎకరాలు అయితే పోలీరెడ్డిపల్లి చెరువు సమీపంలోని సర్వేనంబర్ 112,113 లో కొందరు దళారుల ద్వారా కొంత భూమిని కొనుగోలు చేసినట్లు 2019 లో రికార్డులు సృష్టించి 2026లో రిస్ట్రేషన్ చేసి ఒక రైతు చెరువు శిఖం భూమిని సైతం కబ్జా చేస్తున్నాడని సమాచారం.

కొనుగోలు చేసిన భూమిని సాగుకు చదును చేస్తున్నాననే సాకుతో జేసిబి, హిటాచి యంత్రాలను ఉపయోగించి దళారుల అండదండలతో దాదాపు 10 ఎకరాలకు పైగా చెరువు శిఖం భూమిని కబ్జా చేసుకునే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తాను కొనుగోలు చేసిన పట్టాభూమికి ఆనుకొని ఉన్న చెరువులోకి మట్టిని పోసి గేనాలు కట్టి కబ్జా చేసుకుంటున్నాడు.

అదేవిధంగా చెరువు కట్టను సైతం తొలిచి వేస్తూ తన పట్టా భూమిలో కలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. చెరువు తూమును పూడ్చి బోర్లు వేసి చెరువు శిఖం భూములు కబ్జాలకు గురవుతుంటే భవిష్యత్తులో చెరువులు మాయమయ్యే పరస్థితులు సంభవిస్తాయని పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి మండల కేంద్రంలో చెరువు శఖం భూమి కబ్జాకు గురవుతుండగా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో అధికారులు ఇప్పటికైనా స్పందించి పోలిరెడ్డిపల్లి చెరువు కబ్జాదారుల కబందహస్తాల నుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story