Nellore: ప్రశ్నించే గొంతుకలపై అణచివేత: రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు!
Nellore: కర్నూలు జిల్లాలలో ఐ న్యూస్ రిపోర్టర్ల అక్రమ అరెస్ట్‌లను ఖండిస్తూ నెల్లూరు వీఆర్‌సీ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు భారీ నిరసన తెలిపారు.
Nellore: ప్రశ్నించే గొంతుకలపై అణచివేత: రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు!
Nellore: కర్నూలు జిల్లా,నంద్యాల జిల్లా లో న్యాయ శాఖ మంత్రి NMD ఫరూక్ తనయులు షాడో మంత్రులుగా వ్యవహరిస్తున్నారు తీవ్ర అవినీతి, ఆరోపణలుకు పాల్పడుతున్నారు అని I NEWS లో కదనం టెలికాస్ట్ కావడంతో అది జీర్ణించుకోలేని మంత్రి తన అనుచరులు చే తప్పుడు కేసులు పెట్టించి ముగ్గురు రిపోర్టులు ను అరెస్ట్ చేసి జైలుకు పంపించడాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు లు నిరసనలు తెలుపుతున్నారు,ఇందులో భాగంగా
నెల్లూరు నగరం లోని VRC సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ జర్నలిస్ట్ సంఘాలకు చెందిన జర్నలిస్ట్ లు పెద్ద ఎత్తున పాల్గొని జర్నలిస్ట్ ల అరెస్ట్ ను ఖండించారు... ఈ సందర్భంగా పలువురు జర్నలిస్ట్ లు మాట్లాడుతూ ప్రశ్నిస్తే అరెస్ట్ లు చేయడం, నాన్ బెయిల్ బుల్ సెక్షన్లు పెట్టి జైలుకు పంపించడం మంచి పద్ధతి కాదని, అధికారుల విధులకు ఆటంకం కలిగితే కేసులు పెట్టినట్లే జర్నలిస్ట్ ల విధులకు ఆటంకం కలిగితే చర్యలు ఉండేలా కొత్త చట్టం తేవాలని,
వందల వేలకోట్లు దోచుకునే వారిని వదిలేసి వారి అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్ట్ ల పై ప్రభుత్వాలు ప్రతాపం చూపడం మానేయాలని,ప్రభుత్వాలకు భజన చేస్తేనే మంచిగా ఉంటాం,అవినీతి పై వార్తలు రాస్తే అరెస్ట్ లు చేస్తాం అంటే జర్నలిస్ట్ లు ఉద్యమం చేస్తామని, అక్రమ అరెస్ట్ లు చేసిన రిపోర్టర్లు ను వెంటనే విడుదల చేయాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మరింత ఉదృతం చేస్తాం అని అసెంబ్లీ సైతం ముట్టడి చేస్తామని జర్నలిస్ట్ లు పేర్కొన్నారు...




