Nellore: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు: నెల్లూరులో జనసేన ఇంటింటి ప్రచారం!

Nellore: నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల దరఖాస్తులపై జనసేన వీరమహిళ విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో ఇంటింటి అవగాహన ప్రచారం నిర్వహించారు.

A Praveen, Nellore
Published on: 8 Sept 2026 3:57 PM IST
Nellore
X

Nellore: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు: నెల్లూరులో జనసేన ఇంటింటి ప్రచారం!

నెల్లూరు: పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హులైన వర్గాలకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన NTR భరోసా కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణపై నెల్లూరు నగరంలోని 16వ డివిజన్‌ గుర్రాలమడుగు ప్రాంతంలో జనసేన పార్టీ నాయకులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఏఎంసీ డైరెక్టర్, జనసేన వీరమహిళ విజయలక్ష్మి గునుకుల తదితరులు ఇంటింటికీ వెళ్లి స్థానిక ప్రజలను కలిసి కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు కొత్త పెన్షన్ల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

“అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి”

ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజా సంక్షేమ దృక్పథంతో, కూటమి ప్రభుత్వం పేదలు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోందని తెలిపారు. NTR భరోసా పింఛన్లను విజయవంతంగా అమలు చేయడంలో పవన్ కళ్యాణ్ కూడా గతంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.

అదేవిధంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో నెల్లూరు నగర అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని నాయకులు పేర్కొన్నారు.

16వ డివిజన్‌లో ప్రజలను కలిసి పెన్షన్ల వివరాలను తెలియజేస్తూ, ఎవరు అర్హులు, ఏ పత్రాలు అవసరం, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అనే అంశాలను వివరించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ కోసం అందిస్తున్న ఈ అవకాశాన్ని స్వాగతిస్తూ, తమ సమస్యలను నాయకులతో పంచుకున్నారు.

“ప్రభుత్వ సంక్షేమ పథకం అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరే వరకు జనసేన ప్రజలతోనే ఉంటుంది” అని తెలిపారు.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story