Nellore: చెన్నైకి వందల కోట్ల ఇసుక దోపిడీ: బీజేపీ నేత మిడతల రమేష్ సంచలన వ్యాఖ్యలు!
Nellore: నెల్లూరు జిల్లాలో పెన్నా, స్వర్ణముఖి నదుల నుంచి చెన్నైకి వందల కోట్ల అక్రమ ఇసుక తరలింపుపై బీజేపీ నేత మిడతల రమేష్ కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు.
Nellore: చెన్నైకి వందల కోట్ల ఇసుక దోపిడీ: బీజేపీ నేత మిడతల రమేష్ సంచలన వ్యాఖ్యలు!
నెల్లూరు: భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్ నమే గంగామి జాతీయ నాయకులు మిడతల రమేష్ జిల్లాలో ఇసుక అక్రమాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెన్నా నది స్వర్ణముఖి కండలేరు సహా ప్రధాన నదులలో ఉన్న ఇసుకను వందల కోట్లకు చెన్నైకి విక్రయిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఇవాళ జరిగిన ప్రజా విజ్ఞప్తుల వేదికలో అక్రమ ఇసుక తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రంలో మత్స్య సంపద అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నదుల్లో భారీ యంత్రాలను వాడకూడదంటూ నిషేధాజ్ఞలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినా ఇసుక మాఫియాలు పట్టించుకోవడం లేదన్నారు.
అక్రమ ఇసుక మాఫియా పై ప్రశ్నించినందుకు కొందరు మాఫియా నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు పర్యావరణానికి విఘాతం కలిగించే జలవనులను దోపిడీ చేసే వారిపై పోరాటం కొనసాగిస్తానని మిడతల రమేష్ అన్నారు.




