Nellore: చేతికందిన మామిడి పంట కళ్లముందే నాశనం.. రైతుల ఆవేదన

Nellore: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్ల గ్రామంలో ప్రకృతి విలయం. బలమైన ఈదురు గాలులకు నేలకూలిన మామిడి తోటలు.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 22 May 2026 8:28 PM IST
Nellore
X

Nellore: చేతికందిన మామిడి పంట కళ్లముందే నాశనం.. రైతుల ఆవేదన

Nellore: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్ల గ్రామంలో ఈదురు గాలులు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. అకాల వాతావరణ మార్పులతో ఒక్కసారిగా వీచిన బలమైన గాలులకు మామిడి తోటలు భారీ నష్టాన్ని చవిచూశాయి. బలమైన ఈదురు గాలుల ప్రభావంతో ఎన్నో మామిడి చెట్లు నేలకొరిగిపోయాయి.

ఇంకా కోతకు సిద్ధంగా ఉన్న వేలాది మామిడి కాయలు చెట్ల నుంచి రాలిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎంతో ఆశతో సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలోనే ప్రకృతి విరుచుకుపడటంతో రైతుల కష్టాలు వృథా అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి సాగుకు ఎకరాకు భారీగా పెట్టుబడులు పెట్టామని, ఇప్పుడు పంట పూర్తిగా దెబ్బతినడంతో పెట్టిన ఖర్చులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. అప్పులు చేసి సాగు చేసిన తమకు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రకృతి విపత్తులతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI

Next Story