Atmakur: ఆత్మకూరులో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ తనిఖీ

Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 5 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను హెల్త్ సూపర్వైజర్ సిబ్బందితో కలిసి పరిశీలించి, తాగునీటి నాణ్యతను తనిఖీ చేశారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 17 Aug 2026 7:33 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరులో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ తనిఖీ

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని యూపీఎస్సీ అరుంధతివాడ పరిధిలో ఉన్న 5 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను హెల్త్ సూపర్వైజర్ తన సిబ్బందితో కలసి సందర్శించి సమగ్రంగా పరిశీలించారు.ప్రజలకు సురక్షితమైన,పరిశుభ్రమైన తాగునీరు అందుతున్నదా అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ,వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో జరుగుతున్న నీటి శుద్ధి ప్రక్రియ, ప్లాంట్ నిర్వహణ, నీటి నిల్వ,సరఫరా విధానం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం యూపీఎస్సీ అరుంధతివాడ పరిధిలోని నీటి ట్యాంకును కూడా పరిశీలించి, ట్యాంకులోని నీటి నిల్వ పరిస్థితి, ట్యాంకు పరిశుభ్రత, పరిసరాల పారిశుధ్యం,నీటి సరఫరా వ్యవస్థ తదితర అంశాలను పూర్తిగా తనిఖీ చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన తాగునీరు నిరంతరంగా అందేలా తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి తగిన సూచనలు చేశారు.

మున్సిపల్ కమిషనర్‌కు కృతజ్ఞతలు

ప్రజలకు నీటి కొరత లేకుండా చూడటంలో ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ శ్రీ గంగ ప్రసాద్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని హెల్త్ సిబ్బంది తెలిపారు. ప్రతిరోజూ ఉదయాన్నే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను స్వయంగా పరిశీలిస్తూ, నీటి సరఫరా పరిస్థితిని సమీక్షించి సిబ్బందికి అవసరమైన సలహాలు,సూచనలు చేస్తూ ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

ప్రజల తాగునీటి అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న మున్సిపల్ కమిషనర్ గంగ ప్రసాద్ కు హెల్త్ సూపర్వైజర్,బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎస్. సుధాకర్,హెల్త్ అసిస్టెంట్ జి. రవీందర్ రెడ్డి, శ్రీరాములు పాల్గొన్నారు.పరిశుభ్రమైన తాగునీరు – ప్రజల ఆరోగ్యానికి రక్షణ” అనే లక్ష్యంతో మున్సిపల్ అధికారులు మరియు హెల్త్ సిబ్బంది సమన్వయంతో నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story