Nellore: నెల్లూరు కలెక్టరేట్‌లో ఘనంగా లక్ష్మణస్వామి వర్మ జయంతి

Nellore: నెల్లూరు కలెక్టరేట్ శంకరన్ హాల్‌లో ఘనంగా పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ 157వ జయంతి వేడుకలు. పాల్గొన్న అధికారులు, అగ్నికుల క్షత్రియ సంఘ నాయకులు.

V. Narasimhulu, Nellore
Published on: 7 Aug 2026 5:02 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు కలెక్టరేట్‌లో ఘనంగా లక్ష్మణస్వామి వర్మ జయంతి

నెల్లూరు: సంఘ సంస్కర్త,సమాజ సేవకులు, అగ్నికులక్షత్రియ మహాసంఘ వ్యవస్థాపకులు కీ.శే. పొన్నమండ. లక్ష్మణ స్వామి వర్మ 157 వ జయంతి కార్యక్రమాన్ని నెల్లూరు, కలెక్టర్ కార్యాలయంలోని శంకరన్ హాల్ లో నేటి ఉదయం ఘనంగా నిర్వహించారు.

కీ.శే. లక్ష్మణస్వామి వర్మ జయంతి ని రాష్ట్రప్రభుత్వ ఉత్సవంగా ప్రతిఏడాది నిర్వహించాలనే ప్రభుత్వ ఉత్తర్వులమేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారిణి ఈకార్యక్రమం నిర్వహించారు. తొలుత లక్ష్మణస్వామి వర్మ చిత్ర పటానికి పూలమాల వేసి, పుష్పాంజలి సమర్పించారు.

ఈకార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమార్ , జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారిణి వెంకటలక్ష్మి, నెల్లూరు జిల్లా అగ్నికులక్షత్రియ సంఘం ప్రధానకార్యదర్శి తిరువత్తూరు. శివశంకర్, అగ్నికులక్షత్రియ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ కంచి. జ్ఞానేంద్ర, సంఘ సహాయకార్యదర్శి జి.చంద్రశేఖర్,48 వ డివిజన్ టీడీపీ నాయకురాలు వేలూరు.

కీర్తి, సంఘ న్యాయ సలహాధారులు,సీనియర్ న్యాయవాది కె. శరత్ శ్చంద్రబాబు, శ్రీకృష్ణధర్మరాజస్వామి వారి దేవస్థానం (మూలాపేట) చైర్మన్ వేలూరు. పెంచలరాజా తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు, గూడూరు, కావలి, ఇందుకూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం కు చెందిన మన అగ్నికులక్షత్రియ సంఘ నాయకులు, సంఘసభ్యులు, కులప్రముఖులు, బీసీ సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story