Nellore: ఫతేఖాన్‌పేటలో ఘనంగా బాల గణపతి ఆగమన వేడుకలు

Nellore: నెల్లూరు ఫతేఖాన్‌పేటలో బాల గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక ఆగమన వేడుకలు, ఊరేగింపు మరియు లేజర్ షోలు ఘనంగా నిర్వహించారు.

A Praveen, Nellore
Published on: 10 Sept 2026 4:09 PM IST
Nellore
X

Nellore: ఫతేఖాన్‌పేటలో ఘనంగా బాల గణపతి ఆగమన వేడుకలు

నెల్లూరు: నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ, అతి భారీ గణనాథుల విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫతేఖాన్‌పేట పెండెంవారి వీధికి చెందిన బాల గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుడి ఆగమన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

బాల గణనాథుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి నగర వీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, భక్తుల సందడి నడుమ సాగిన ఈ ఊరేగింపు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం పెండెంవారి వీధిలో ఏర్పాటు చేసిన మండపం వద్ద విద్యుత్ దీపాలంకరణలు, లేజర్ షో, బాణాసంచా ప్రదర్శనలతో వినాయకుడికి ఘన స్వాగతం పలికారు.

బాల గణనాథుడి ఆగమనం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానిక ప్రజలు తరలివచ్చి వేడుకలను ఆసక్తిగా తిలకించారు. భక్తి, ఉత్సాహం, సందడి మధ్య జరిగిన ఈ కార్యక్రమం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story