పెన్నబద్వేల్ ఎంపీపీ పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన
Pennabadvel: నెల్లూరు జిల్లా కలువాయి మండలం పెన్నబద్వేల్ ఎంపీపీ పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.
పెన్నబద్వేల్ ఎంపీపీ పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన
Pennabadvel: నెల్లూరు జిల్లా కలువాయి మండలం పెన్నబద్వేల్ ఎంపీపీ పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కలువాయి గ్రామానికి చెందిన కొలపర్తి కళ్యాణ్,హర్షిత దంపతులు ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో విద్యాదేవత సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించిన ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
విద్యార్థుల్లో విద్యాభివృద్ధితో పాటు సాంస్కృతిక, నైతిక విలువలు పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ తల్లిదండ్రులు సురేష్, రజనీ, ఎంఈఓ జనార్దన్ రెడ్డి, హెచ్‌ఎం కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




