Nellore: నవలాకులతోటలో రూ.63 లక్షలతో ముస్లిం షాదీమంజిల్‌కు శంకుస్థాపన!

Nellore: నెల్లూరు రూరల్ 1వ డివిజన్‌లో రూ.63 లక్షలతో షాదీమంజిల్ నిర్మాణానికి శంకుస్థాపన. పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 14 Sept 2026 3:47 PM IST
Nellore
X

Nellore: నవలాకులతోటలో రూ.63 లక్షలతో ముస్లిం షాదీమంజిల్‌కు శంకుస్థాపన!

Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 1వ డివిజన్ నవలాకులతోటలో రూ.63 లక్షల రూపాయల వ్యయంతో ముస్లిం షాదీమంజిల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ముస్లిం మతపెద్దలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ సోదరుల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కట్టుబడి ఉన్నారని,

షాదీమంజిల్ భవనం నిర్మాణం పూర్తయితే పేద, మధ్యతరగతి ముస్లిం కుటుంబాలకు వివాహాది శుభకార్యాలను నిర్వహించుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1వ డివిజన్ అభివృద్ధికి 14 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రూరల్ ఎమ్మెల్యే6 కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ లో 857 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

నవలాకులతోటలో షాదీ మంజిల్ నిర్మాణానికి నిధులు కేటాయించడం పట్ల స్థానిక ముస్లిం సోదరులు, ప్రజలు హర్షం వ్యక్తం చేసి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, క్లస్టర్ ఇంచార్జులు కుడుముల చిరంజీవి, షంషుద్దీన్, సాబీర్ ఖాన్, 1వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు జావీద్, కోడూరుపాడు PACS సొసైటీ చైర్మన్ గంగి జయరామి రెడ్డి, ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఛైర్మెన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్, టీడీపీ నాయకులు జానకి రామయ్య, సుబ్బరామయ్య, రఫీ, అజీజ్, షరీఫ్, బాబు, అక్బర్, అమీర్, నరసింహ రావు, జబ్బార్, సత్తాజ్, గౌస్, కరీముల్లా, బిలాల్, సలీం, హుస్సేన్, షాహుల్, మజహర్, దొంతు విజయ్ కుమార్, కిషన్ యాదవ్, తిరుమల, గజాలి, షాన్, రమేష్, షఫీ, ఫయాజ్, ఉమర్, లక్ష్మయ్య, రాజు, విజయ లక్ష్మి, జయరాం, రత్నం, యనమల విజయ్, జనసేన నాయకులు పవన్ కుమార్ యాదవ్ మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE