Nellore: ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న డాక్టర్ జల్లి దినేష్

Nellore: నెల్లూరు డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు. ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న వలిపేడు పీహెచ్‌సీ డాక్టర్ జల్లి దినేష్. అభినందించిన సిబ్బంది.

Venkata Thirumala
Published on: 15 Aug 2026 8:53 PM IST
Nellore
X

Nellore: ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న డాక్టర్ జల్లి దినేష్

నెల్లూరు: నెల్లూరు డి ఎం అండ్ హెచ్ ఓ ఆఫీస్ లో శనివారం నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చిల్లకూరు మండలం వలిపేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో వైద్యుడిగా సేవలందిస్తున్న డాక్టర్ జల్లి దినేష్‌కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ వి. సుజాత చేతుల మీదుగా డాక్టర్ జల్లి దినేష్ ఉత్తమ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ప్రజలకు అంకితభావంతో వైద్య సేవలు అందిస్తూ, విధి నిర్వహణలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించినట్లు అధికారులు తెలిపారు.

ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి వైద్యుడిగా స్థిరపడి, పేదలు, సామాన్యులకు సేవలందిస్తున్న డాక్టర్ దినేష్‌కు ఈ పురస్కారం దక్కడం పట్ల వలిపేడు పీహెచ్‌సీ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని సిబ్బంది ఆకాంక్షించారు.

Venkata Thirumala

Venkata Thirumala

Next Story