Nellore: సంగం మండలంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా ‘పల్లె వీక్షణ’
Nellore: నెల్లూరు జిల్లా సంగం మండలం మక్తాపురం పంచాయతీలో సెప్టెంబర్ 3న కలెక్టర్ హిమాన్షు శుక్లా పల్లె వీక్షణ పర్యటన నిర్వహించి అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు.
Nellore: సంగం మండలంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా ‘పల్లె వీక్షణ’
నెల్లూరు: నెల్లూరు జిల్లా సంగం మండలం మక్తాపురం గ్రామ పంచాయతీ పరిధిలో సెప్టెంబర్ 3న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ‘పల్లె వీక్షణ’ కార్యక్రమంలో భాగంగా పర్యటించనున్నారు.ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాలు, మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.
పర్యటనలో భాగంగా ముందుగా తరుణవాయలోని ఐటీఐ కళాశాలను పరిశీలిస్తారు.అనంతరం పల్లెపాలెంలో జరుగుతున్న ఫీల్డ్ ఛానల్ పనులను తనిఖీ చేస్తారు. మక్తాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రం, పశువుల కొట్టం, ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌లను సందర్శించనున్నారు.
అలాగే వాటర్ సోర్స్ డైరెక్ట్ పంపింగ్ స్కీమ్‌ను పరిశీలించి, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే స్టాల్ ద్వారా పశుపోషకులకు దాణా, విత్తనాలను పంపిణీ చేయనున్నారు.
రైతులకు పీఎండీఎస్ కిట్లను అందజేయనున్నారు.పర్యటనలో భాగంగా నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు.




