Nellore: ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’లో కలెక్టర్.. నెల్లూరు వీధుల్లో స్వయంగా పారిశుద్ధ్య పనులు!
Nellore: నెల్లూరులో చీపురు పట్టిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా. ఆపరేషన్ క్లీన్ స్వీప్‌లో భాగంగా మున్సిపల్ అధికారులతో కలిసి స్వయంగా వీధులు ఊడ్చిన కలెక్టర్.
Nellore: ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’లో కలెక్టర్.. నెల్లూరు వీధుల్లో స్వయంగా పారిశుద్ధ్య పనులు!
Nellore: ఆయన ఓ జిల్లా కలెక్టర్, జిల్లా పాలన అధికారి, అలాంటి అధికారి నెల్లూరులో ఇవాళ ఉదయం చీపురు పట్టారు.. వీధులను ఊడ్చారు.. పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.. ఆయనే నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా ఇవాళ జిల్లా కలెక్టర్.. జిల్లా కేంద్రం లోని అధికారులతో కలిసి నగరంలో.. చీపురుతో వీధులను ఊడ్చారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా వాసులకు పలు ఆరోగ్య సూత్రాలు.. పారిశుధ్యం పై సూచనలు చేశారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి ధ్యేయంగా భావించినప్పుడు ప్రజారోగ్యం పూర్తిస్థాయిలో కుదుటపడుతుందని అన్నారు. పరిశుభ్రల పరిసరాల పరిసరాల శుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన జిల్లా వాసులను కోరారు. అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టిసారించి.. జిల్లాను పరిశుభ్రమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.




