Nellore: బస్టాండ్ సెంటర్లో బహిరంగ మద్యం.. భయపడుతున్న ప్రయాణికులు

Nellore: నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదురుపల్లి బస్టాండ్ సెంటర్ ముఠాకోరులకు అడ్డాగా మారింది.

Madhav Goud, Nellore
Published on: 21 Jun 2026 9:02 PM IST
Nellore
X

Nellore: బస్టాండ్ సెంటర్లో బహిరంగ మద్యం.. భయపడుతున్న ప్రయాణికులు

Nellore: నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదురుపల్లి బస్టాండ్ సెంటర్‌లో డివైడర్ల వద్ద బీరు సీసాలు గుట్టలుగా పేరుకుపోవడంతో ప్రయాణికులు, గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రాత్రి వేళల్లో కొంతమంది ఆకతాయిలు బహిరంగంగా మద్యం సేవించి సీసాలను అక్కడే పడేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఆకతాయిల ఆగడాలు పెరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు స్పందించి సీసీ కెమెరాలను పునరుద్ధరించి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పోలీస్ లు నిఘా పెట్టాలని కోరుతున్నారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore

Next Story