Atmakur: కాసుల కోసం కన్నతల్లి గొంతు కోసిన కూతురు!

Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో దారుణం. చనిపోయిన తమ్ముడి ఇన్సూరెన్స్ డబ్బులు కోసం కన్నతల్లిపై కూతురు బ్లేడుతో గొంతుకోసి హత్యాయత్నానికి ఒడిగట్టింది.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 25 May 2026 8:02 PM IST
Atmakur
X

Atmakur: కాసుల కోసం కన్నతల్లి గొంతు కోసిన కూతురు!

Atmakur: "ధనం మూలం ఇదం జగత్" అన్న నానుడి ఎలా పుట్టిందో ఏమో కానీ... ప్రస్తుత సమాజ పరిణామాలను పరిశీలిస్తే రక్త సంబంధాలు మటుమాయమై కాసులు కోసం కన్నవారిని నిర్దాక్షిణ్యంగా కడతేర్చే రోజులు అందరినీ కలిచి వేస్తున్నాయి. సర్వత్రా ఆందోళననూ కలిగిస్తున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు రూరల్ మండల పరిధిలోని బట్టేపాడు లో జరిగిన ఓ దారుణం ఇందుకు ప్రత్యక్ష తార్కారణంగా ఉంది. కన్నబిడ్డ చనిపోవడంతో అతనికి వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బుల కోసం స్వయానా తోబుట్టువు కన్నతల్లినే హతమార్చి ఆ నగదును కాజేయాలన్న దురాలోచనతో కన్న తల్లి పైనే కడతేర్చాలని... హత్యాయత్నానికి ఒడిగట్టిన దారుణ మారణ సంఘటన ఇది.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లి రమణమ్మ పై కూతురు సుమతి బ్లేడుతో గొంతు కోసి హత్యాయత్నం చేసింది. దీంతో తల్లి కేకలు వేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయాల పాలైన రమణమ్మను ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు.

ఇటీవల బాధితురాలు రావణమ్మ కొడుకు మృతిచెందగా ఇన్సూరెన్స్ డబ్బులు తల్లి రమణమ్మకు అధికారులు ఇచ్చారు. తెలుసుకున్న కూతురు సుమతి అర్ధరాత్రి గ్రామానికి చేరుకొని తల్లితో ఇన్సూరెన్స్ డబ్బులు,నగలు తనకు ఇవ్వాలని వాగ్వాదానికి ఆవేశంతో బ్లేడుతో తల్లి గొంతు కోసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి తల్లి రమణమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కూతురు సుమతిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story