Nellore: అనగుంట అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా రాష్ట్రీయ పోషణ్ మాస్
Nellore: నెల్లూరు అనగుంట అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా రాష్ట్రీయ పోషణ్ మాస్ ఉత్సవాలు. పాల్గొన్న సీడీపీఓ టి. అరుణ, ఐసీడీఎస్ సిబ్బంది.
Nellore: అనగుంట అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా రాష్ట్రీయ పోషణ్ మాస్
నెల్లూరు: ఐసీడీఎస్ ప్రాజెక్టు నెల్లూరు పరిధిలోని కొండాయపాలెం సెక్టార్‌లోని, అనగుంట అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం 9వ రాష్ట్రీయ పోషణ్ మాస్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో సీడీపీఓ టి. అరుణ పాల్గొని, పోషణ్ మా కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను వివరించారు.
ముఖ్యంగా ‘’ నా ఆరోగ్యకరమైన ప్లేట్ ‘’ చిరుధాన్యాలు, ఆకుకూరలు, వివిధ రకాల కూరగాయలు, పండ్లు మరియు ప్రోటీన్ అధికంగా లభించే ఆహార పదార్థాలతో ప్రత్యేకంగా లైవ్ డెమో నిర్వహించారు. రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు మరియు పప్పుదినుసులు వంటి పోషక విలువలు కలిగిన పదార్థాలను చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు, ముఖ్యంగా ప్రోటీన్, విటమిన్లు, ఖనిజ లవణాలు లభిస్తాయని లైవ్ డెమో ద్వారా వివరించారు.
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు మరియు కుటుంబాల్లో పౌష్టికాహారం, ఆరోగ్యం, పరిశుభ్రత, పిల్లల ఎదుగుదల, సమతుల్య ఆహారం వంటి అంశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. పోషణ్ మా లో భాగంగా పోషకాహార ప్రదర్శన, ప్రోటీన్ ఎక్కువగా లభించే పోషక పదార్థాలతో వంటకాల తయారీ, పిల్లల ఎదుగుదల–బరువు పర్యవేక్షణ, ఆరోగ్య–పోషణ అవగాహన, పరిశుభ్రత మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కొండాయపాలెం సెక్టార్ సూపర్ వైజర్. ఏ. ప్రమీల పాల్గొని పోషణ్ మా ద్వారా ప్రతి కుటుంబానికి పోషణపై అవగాహన చేరేలా అంగన్‌వాడీ సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ కార్యకర్త సిహెచ్. గౌతమి, ఎంఎస్‌కే, కే. శోభారాణి, ఏఎన్‌ఎం సిహెచ్. ప్రసన్న, ఆశా వర్కర్ డి. నిర్మల, అంగన్‌వాడీ హెల్పర్ కే. శ్రావ్య పాల్గొన్నారు.




