Nellore: నారాయణ గోమతి సీబీఎస్ఈ స్కూల్‌లో జాతీయ క్రీడా దినోత్సవం!
Nellore: నెల్లూరు నారాయణ గోమతి సీబీఎస్ఈ స్కూల్‌లో ఘనంగా నేషనల్ స్పోర్ట్స్ డే. విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించిన యాజమాన్యం.
Nellore: నారాయణ గోమతి సీబీఎస్ఈ స్కూల్‌లో జాతీయ క్రీడా దినోత్సవం!
Nellore: భారత హాకీ దిగ్గజం, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని శనివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని నారాయణ గోమతి సీబీఎస్ఈ స్కూల్ లో ఘనంగా నిర్వహించారు.నారాయణ గ్రూప్ జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, క్లస్టర్ ప్రిన్సిపాల్ శ్రీమతి కాంతి సూచనల తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు.
విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్, నాయకత్వ లక్షణాలు, పోటీతత్వ స్ఫూర్తి పెంపొందుతాయని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ పవనార్క్, వైస్ ప్రిన్సిపాల్ సౌమ్య రెడ్డి, ఏవో సాయి ప్రసాద్, పి ఈ టి లు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు, వారి సమగ్ర అభివృద్ధికి క్రీడలు ఎంతో అవసరమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.




