Naidupeta: నాయుడుపేటలో హోరెత్తిన వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు!

Naidupeta: నాయుడుపేట అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో YSRCP రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Aug 2026 4:00 PM IST
Naidupeta
X

Naidupeta: నాయుడుపేటలో హోరెత్తిన వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు!

నాయుడుపేటలోని: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సిపి రిలే నిరాహార దీక్షలు

తిరుపతి జిల్లా నాయుడుపేటలోని డాక్టర్ బి.ఆర్ విగ్రహం వద్ద ప్రారంభమైన వైఎస్ఆర్సిపి రిలే నిరాహార దీక్షల కార్యక్రమం, ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీలో అవకతవకలు జరిగినందుకుగాను డీఎస్సీ పై సిబిఐ విచారణ వేస్తూ మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మొత్తం వైఎస్ఆర్సిపి నాయకులు ఈనెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షల కార్యక్రమం ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సూళ్లూరుపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు,

ఈరోజు నుండి ప్రారంభమైన వైఎస్ఆర్సిపి రిలే నిరాహార దీక్ష అందులో భాగంగా ఈరోజు మొదటగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, అనంతరం పక్కనే ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, అనంతరం నాయుడుపేట లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ రిలే నిరాహార దీక్షల కార్యక్రమమును ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సులూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో భారీగా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story