Chejerla: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఆత్మకూరు ఎంవీఐ రాములు హెచ్చరిక

Chejerla: ల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లిలో ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (MVI) రాములు వాహనాల తనిఖీ చేపట్టారు.

Madhav Goud, Nellore
Published on: 9 Aug 2026 9:48 PM IST
Chejerla
X

Chejerla: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఆత్మకూరు ఎంవీఐ రాములు హెచ్చరిక

చేజర్ల: నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లి లో ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం రాములు ఆదివారం సాయంత్రం పలు వాహనాలు తనిఖీ చేశారు, ఈ తనిఖీల్లో అధికలోడ్ తో వెళ్తున్న 2 వాహనాలకు 62 వేలు, లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న డ్రైవర్లకు 20 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్రవాహనదారు లు విధిగా హెల్మెట్ ధరించాలని, వాహనదారులు పరిమితికి మించి రవాణాచేయకూడదన్నారు. అలాగే అధిక వేగం పనికిరాదన్నారు.తనిఖీ సమయాల్లో వాహన చోదకులు లైసెన్స్ లు సంబంధిత పత్రాలు చూపించాలన్నారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore

Next Story