Nellore: ముత్తుకూరులో 'రచ్చబండ' చర్చా వేదిక
Nellore: ముత్తుకూరులోని షాదీ మంజిల్ వేదికగా 'ది పర్యావరణ ఉపాధి సాధన వేదిక' ఆధ్వర్యంలో "రచ్చబండ" చర్చా వేదిక నిర్వహించారు.
Nellore: ముత్తుకూరులో 'రచ్చబండ' చర్చా వేదిక
Nellore: "మన ఊరు - మన ఆరోగ్యం - ఉపాధి మన హక్కు" అనే నినాదంతో 'ది పర్యావరణ ఉపాధి సాధన వేదిక' ఆధ్వర్యంలో ఆదివారం ముత్తుకూరులోని షాదీ మంజిల్ నందు నిర్వహించిన "రచ్చబండ" చర్చ వేదిక జరిగింది వేదిక నాయకులు శిఖరం నరహరి, వెనాటి శ్రీనివాసుల రెడ్డి తదితరులు ఉపన్యాసించారు. రాజకీయాలకతీతంగా వచ్చిన యువత, రైతులు, మహిళలు, మత్స్యకారులు ఈ సభలో పాల్గొని, కాలుష్యంపై మరియు స్థానికులకు ఉపాధి పై ఉమ్మడి పోరాటానికి ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ సందర్భంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు 14 సమగ్ర డిమాండ్లు, 6 అంచెల కార్యాచరణను వేదిక ప్రతినిధులు ప్రకటించారు.
ముఖ్యమైన 14 డిమాండ్లు:--
75% స్థానిక ఉపాధి: కృష్ణపట్నం పోర్టు, పవర్ ప్లాంట్లు, అన్ని పరిశ్రమలలో స్థానికులకే 75% ఉద్యోగాలు ఇవ్వాలి.
ఉచిత నైపుణ్య శిక్షణ: కంపెనీల ఖర్చులతోనే స్థానిక యువతకు ఉచిత ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి.
సమాన వేతనం: చట్టం ప్రకారం (Code on Wages 2019) ఒకే లాంటి పనికి సమాన జీతం ఇవ్వాలి.
కనీస జీతాలు: కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతను బట్టి నెలకు ₹20,358 నుండి ₹24,804 పైగా జీతాలు, PF, ESI సౌకర్యాలు కల్పించాలి.
CSR నిధులు: కంపెనీల CSR నిధుల్లో కనీసం 50% నేరుగా స్థానిక గ్రామాల అభివృద్ధికి ఖర్చు పెట్టాలి.
ఉచిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్: కాలుష్య రోగాల నివారణకు ముత్తుకూరులో ఉచిత కార్పొరేట్ వైద్యం అందించాలి.
ప్రత్యేక బైపాస్ రోడ్లు: బొగ్గు లారీల వల్ల జరిగే ప్రమాదాలు, కాలుష్యం ఆపడానికి ప్రత్యేక రోడ్లు వేయాలి.
బూడిద (Fly Ash) నియంత్రణ: పవర్ ప్లాంట్ల బూడిదను 100% క్లియర్ చేయాలి, యాష్ పాండ్స్కు లీకేజీ లేకుండా ప్లాస్టిక్ లైనింగ్ వేయాలి.
బొగ్గు ధూళి నివారణ: పోర్టులో బొగ్గు రవాణాను పూర్తిగా యాంత్రీకరణ (Mechanized) చేయాలి.
నీటి వనరుల రక్షణ: ఫ్యాక్టరీల కెమికల్, వేడి నీటిని శుద్ధి చేశాకే వదలాలి. తాగునీరు పాడవకుండా చూడాలి.
మత్స్యకారుల రక్షణ: వేట కోల్పోయిన మత్స్యకారులకు పరిహారం ఇవ్వాలి, పడవల కాలువల్లో పూడికతీత (Dredging) చేపట్టాలి.
పంటల రక్షణ: కాలుష్యం వల్ల దెబ్బతిన్న పంటలకు రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలి.
హామీల అమలు: ల్యాండ్ అక్విజిషన్, పబ్లిక్ హియరింగ్ సమయంలో ఇచ్చిన అన్ని పాత హామీలను నెరవేర్చాలి.
పారదర్శకత: ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రజలతో సమీక్ష సభలు నిర్వహించాలి.
-6 అంచెల భవిష్యత్ కార్యాచరణ విడుదల:
-గ్రామ కమిటీలు: ప్రతి గ్రామంలో రాజకీయ రహిత ప్రజా కమిటీల ఏర్పాటు.
-పర్యావరణ యాత్ర: ప్రతి వారం ఒక్కో గ్రామంలో ప్రజలను చైతన్యపరిచే సభలు.
-ఫ్యాక్ట్-ఫైండింగ్ సర్వే: కాలుష్య రోగాలు, నిరుద్యోగంపై పక్కా ఆధారాల కోసం గ్రామాల్లో సర్వే.
-మహా సంతకాల సేకరణ: డిమాండ్ల సాధన కోసం ప్రభావిత గ్రామాల్లో లక్ష సంతకాల సేకరణ.
-శాస్త్రవేత్తలతో గ్రామ సభ: కాలుష్య నియంత్రణ మండలి (PCB) తప్పుడు నివేదికలను తిప్పికొట్టడానికి పర్యావరణ నిపుణులతో సభలు.
-చట్టపరమైన పోరాటం: కలెక్టర్కు వినతిపత్రం, స్పందించకుంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) మరియు హైకోర్టు ద్వారా న్యాయపోరాటం.చేయాలని తీర్మానం చేశారు.
పరిశ్రమల అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, మా ఊరు మా ఆరోగ్యం మాకు ఉపాధి.. మా హక్కుని , స్థానికుల ప్రాణాలను బలితీసుకునే కాలుష్యాన్ని, నిరుద్యోగాన్ని సహించబోమని వేదిక ప్రతినిధులు స్పష్టం చేశారు. శాంతియుత న్యాయ ఉద్యమం అందరూ భాగస్వాములు కావాలని తెలిపారు. అధికారులు, యాజమాన్యాలు స్పందించి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో యస్.మల్లికార్జున, బూదూరు కృష్ణ మోహన్, ఉడుత రాజశేఖర్ యాదవ్, షేక్ నవీద్ బాషా,(MPTC), వెల్లం గారి వెంకటేశ్వర్లు, వెంకోజీ, పెడకల శ్రీనివాసులు, పి మధు, షెక్ మున్నా తదితరులు పాల్గొన్నారు.




