Chandrasekhar Reddy: మంత్రి నారాయణపై 1200 కోట్ల కుంభకోణం ఆరోపణలు!
Chandrasekhar Reddy: మంత్రి నారాయణపై రూ.1200 కోట్ల చెత్త కుంభకోణం ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి. 12 ప్రశ్నలతో బహిరంగ చర్చకు సవాల్.
Chandrasekhar Reddy: మంత్రి నారాయణపై 1200 కోట్ల కుంభకోణం ఆరోపణలు!
Chandrasekhar Reddy: మంత్రి నారాయణపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్. 1200 కోట్ల కుంబకోణం పై మంత్రి నారాయణకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి 12 ప్రశ్నలు సంధించారు.
బహిరంగ చర్చకు డిమాండ్ చేశారు.
లెగసీ చెత్త — క్లియర్ చేసింది ఎవరు? దోచుకుంటోంది ఎవరు, మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులు ఎప్పటి నుంచి ఉన్నాయి, లెగసీ వేస్ట్‌ను తొలగించే ప్రక్రియను ప్రారంభించింది ఏ ప్రభుత్వం, లెగసీ వేస్ట్ తొలగింపు పేరుతో పన్నెండు వందల కోట్లలో దోపిడీ ఎవరు చేస్తున్నారు.
2019కి ముందు చెత్త కుప్పలు — 2019 తర్వాత మార్పు ఏమిటి? ఏ ప్రభుత్వం లో సంస్కరణలు తెచ్చారు... 2019కి ముందు పట్టణాల్లో కుప్పతొట్లు, రోడ్లపై చెత్త కుప్పలు, డంపింగ్ యార్డుల పరిస్థితి ఎలా ఉంది.2019 తరువాత ఎలా మార్పు జరిగింది, 2019 ముందు–తర్వాత పరిస్థితులపై ఫొటోలు, రికార్డులతో బహిరంగ చర్చకు సిద్ధమా.
CLAP ( క్లీన్ ఆంధ్రప్రదేశ్ ) ఎవరు తెచ్చారు? Door-to-Door Collection ఎవరు విస్తరించారు, CLAP కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఎవరు,
ఇంటింటికీ వాహనాల ద్వారా చెత్త సేకరణ వ్యవస్థను విస్తృతంగా అమలు చేసింది ఏ ప్రభుత్వం? ఆ వ్యవస్థను మార్చి ఇప్పుడు చెత్త సేకరణ పేరుతో ఎంత దోపిడీ చేస్తున్నారు.
83–85 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ 163 లక్షల టన్నులకు ఎలా పెరిగింది, అధికారిక లెక్కల్లో ఇంత భారీ తేడా ఎందుకు వచ్చింది సగటున టన్నుకు సుమారు ₹800 చెల్లిస్తే మొత్తం వ్యయం ఎంత? 1200 కోట్లు. దీనిలో ఎంత దోపిడీ జరిగింది, 15% అదనపు పరిమాణాన్ని ఎందుకు అనుమతించారు, దీని వలన 60 కోట్లు అదనంగా ఎందుకు చెల్లించారు. పరిపాలనా అనుమతులు లేకుండా ఎన్ని లక్షల టన్నులు మీ వారికి అప్పగించారు,భూమి లోపల నుంచి ఎంత వ్యర్థాన్ని తవ్వి తీశారు? ఏ ULBలో ఎంత.
CLAP వాహనాలు Vs ట్రాక్టర్లు Vs ఈ-ఆటోలు — దోపిడీ ఎంత, గతంలో CLAP వాహనాలకు ఒక్కో వాహనానికి ఎంత చెల్లించారు? మీరు నిబంధనలకి విరుద్ధంగా ట్రాక్టర్లను ఎందుకు వినియోగించారు? వాటిల్లో ఎంత దోపిడీ జరిగింది.ఈ-ఆటోలకు ఒక్కొక్కదానికి ఎంత ఖర్చు చేస్తున్నారు, వాహనాల కొనుగోలు/O&Mలో ఒక్కో వాహనంపై అసలు ఖర్చు ఎంత,
చెత్తను తగలబెట్టడం, Capping ఇది పర్యావారణానికి నష్టం కాదా, బయోమైనింగ్ చేయాల్సిన చెత్తను డబ్బులను డ్రా చేసుకొని కూడా చెత్తను ప్రాసెస్ చేయకుండా ఎన్ని మున్సిపాలిటీ లలో తగలబెట్టారు. వాస్తవం కాదా ? చెత్త మీద మట్టి ని కప్పి పెట్టి capping ఎందుకు చేశారు? ఎంత పరిమాణం చేశారు, దానికి ఎంత చెల్లించారు, పర్యావరణ నిబంధనలు ఎందుకు పాటించడం లేదు ? CCTV పర్యవేక్షణ ఉందా.
నామమాత్రపు User Chargesను ‘చెత్త పన్ను’ అన్నారు — ఇప్పుడు ప్రజలపై పన్నుల భారం ఎంత, గత ప్రభుత్వంలో User Charges ఎందుకు విధించారు? ఎంత వసూలైంది, అప్పట్లో ప్రజలపై పడిన మొత్తం భారం ఎంత, ఇప్పుడు వివిధ పట్టణ సేవలు, పన్నులు, ఛార్జీల రూపంలో ప్రజల నుంచి ఎంత వసూలు చేస్తున్నారు? బకాయిల వసూళ్లకు ఒత్తిడి, coercive recovery ఎందుకు.
Compactors & Sweeping Machines పేరుతొ దోపిడీ — కొనుగోలు ధరలు బయటపెడదాం, ఎన్ని compactors, sweeping machines కొనుగోలు చేశారు, ఒక్కో యంత్రం మార్కెట్ ధర ఎంత? ప్రభుత్వం చెల్లించిన ధర ఎంత, ఇటీవల సుమారు ₹104 కోట్లను దుర్వినియోగం చేయడం వాస్తవం కాదా, O&M టెండర్లు — Guidelines ఎవరి కోసం మార్చారు.
O&M టెండర్ల eligibility/guidelinesలో మార్పులు చేశారు ?ఎందుకు చేశారు, ఒకే సంస్థలకే కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కేలా నిబంధనలు రూపొందించారన్న ఆరోపణపై సమాధానం చెప్పండి.
600 కోట్లతో 107 Processing Units లో ఎంత దోపిడీ. 107 processing unitsకు టెండర్లు ఎవరికి ఇచ్చారు, వాటిలో subcontract/sub-leaseలు ఎవరికి వెళ్లాయి, నాసిరకం equipment వాడుతు కోట్ల రూపాయల దోపిడీ పై బహిరంగ చర్చకు సిద్ధమా,
WTE Plants — ysrcp 8 రద్దు చేసింది అన్నారు? గతంలో ప్రతిపాదించిన 10 WTE ప్లాంట్లలో 8ను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని మీరు చేస్తున్న ఆరోపణకు పూర్తి ఆధారాలు బయటపెట్టండి. ఇప్పుడు కొత్తగా 6 WTE ప్లాంట్లు ప్రతిపాదిస్తున్నారు, వాటి capacity, cost, వైయబిలిటీ గ్యాప్ ఫండ్ లో దోపిడ ఎంత.
107 Processing Units / WTE Plants — రెండూ ఎందుకు, రాష్ట్రంలో రోజుకు ఉత్పత్తయ్యే municipal solid waste ఎంత, 107 processing unitsలో ఎంత ప్రాసెస్ చేయగలదు, WTE ప్లాంట్లకు రోజుకు ఎంత feedstock అవసరం, 107 processing units పూర్తిస్థాయిలో పనిచేస్తే WTEలకు అవసరమైన చెత్త ఎక్కడి నుంచి వస్తుంది? రెండింటికీ ప్రజాధనం ఎందుకు దోపిడీ చేస్తున్నారు.
ఈ విషయాలపై షుమారుగా 1200 కోట్ల కుంబకోణం పై నారాయణ తో బహిరంగ చర్చకు సిద్ధం అంటూ సవాల్ విసిరారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.




