Nellore: అక్రమ కేసులకు భయపడబోం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి!

Nellore: ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినా రాజీలేని పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు; నెల్లూరులో మంత్రి నారాయణపై ఆరోపణలు గుప్పించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 12 Aug 2026 10:21 AM IST
Nellore
X

Nellore: అక్రమ కేసులకు భయపడబోం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి!

Nellore: నెల్లూరు నగర కార్పొరేషన్ లో.. అవినీతి పూర్తిగా పెచ్చు మీరి పోయిందన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి క్లీన్ ఏపీ..అనే సంకల్పంతో..ఆటో వాహనాలతో ఇంటింటికి పంపి చెత్త సేకరణ చేపట్టి.. క్లీన్ ఏపీకి స్వీకారం చుట్టారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. దోపిడి పరమావధిగా.. చెత్త సేకరణకు ట్రాక్టర్లు ఏర్పాటు చేసి.. ప్రజా ధనాన్ని కాంట్రాక్టర్లకు.. దోచిపెట్టడమే పనిగా పెట్టుకుందన్నారు.

మరోపక్క స్వీపింగ్ మిషన్ల పేరుతో అడ్డగోలుగా కోట్ల రూపాయల కాంట్రాక్టులను..టిపియస్ కంపెనీకి .. కట్టబెట్టి.. ప్రజాసోమ్మును దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. పేదలు పన్నులు కట్టకపోతే.. వారి స్థలాలను ఇళ్లను వేలం వేస్తామని కోర్టు ద్వారా నోటీసులు పంపి.. వారిని ఇబ్బందులకు గురి చేస్తూ టాక్స్ లు వసూలు చేస్తున్నారని.. ఇలా వసూలు చేసిన ప్రజాధనాన్ని ఈవిధంగా దుర్వినియోగం చేయడం ఆక్షేపనీయమన్నారు.

మరొపక్క కాలువల్లో సిల్ట్ తీయడం.. జాఫర్ సాహెబ్ దుకాణాలు వద్ద.. ఇష్టా రాజ్యాంగ పనులు చేస్తూ.. కార్పొరేషన్ నిధులను అడ్డగోలుగా దోచుకోవడం సరికాదన్నారు. ఇసుక, మట్టి సహజ వనరుల దోపిడీ.. నెల్లూరు నగరంలో యదేచ్ఛగా సాగుతుందన్నారు. కూటమి నేతలు కేవలం అక్రమార్జనే ధ్యేయంగా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 కోట్ల పంట కాలువ భూమిని ఆక్రమించేకోనేందుకు రంగం సిద్ధం చేసుకున్న మంత్రి

ఈనెల 13వ తేదీ జరగబోయే..నెల్లూరు నగర కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో.. యదేచ్ఛగా ప్రభుత్వ భూమిని.. దోచేయడానికి మంత్రి నారాయణ.. సిద్ధమయ్యారని అన్నారు. నారాయణ మెడికల్ కళాశాల వద్ద ఒక ఎకరా 40 సెంట్ల పంట కాలువ.. భూమి నిరుపయోగంగా.. మారిందని, ఇప్పటికే అర్బన్ తహసిల్దార్ వద్ద..నుంచి సర్టిఫికెట్ తీసుకోవడం జరిగిందన్నారు.

ఈ భూమిని నారాయణ విద్యాసంస్థలకు అప్పగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని.. నగర మేయర్ ఇప్పటికే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ను.. జారీ చేసి ఉన్నారని తెలిపారు. ఇక దీనిని తూతూ మంత్రంగా కౌన్సిల్లో పెట్టి, మమా అనిపించేందుకు.. మంత్రి నారాయణ స్కెచ్ వేశారని అన్నారు.

ప్రభుత్వ భూమిని.. ఏదైనా ప్రైవేటు వ్యక్తులు అవసరానికి తీసుకున్నట్లయితే దానికి ప్రత్యామ్నాయంగా.. మరో భూమిని చూపించాల్సి ఉంటుందని, అలా ఏమీ లేకుండా.. కేవలం అధికార.. బలంతోనే మంత్రి నారాయణ ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

రేపటి రోజున అటవి భూమి కూడా నిరుపయోగమని.. సర్టిఫికెట్ తీసుకొని అడవులను కూడా ఆక్రమించేస్తారని అన్నారు. కోట్ల రూపాయల స్థలాలు కొట్టేసి పేదల ఇళ్ళు మాత్రం కూల్చి వేస్తాం అని నోటీసులు ఇస్తున్నారని, నెల్లూరు వెంకటేశ్వరపురం గాంధీ గిరిజన కాలనీలో పేదలు 2 సెంట్ల స్థలంలో ఇల్లు.. నిర్మించుకొని జీవిస్తుంటే.... వారి ఇళ్ళను కూల్చి వేస్తామని నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గం అన్నారు.

అలాంటిది మీరు ఏకంగా పంట కాలువలను ఆక్రమించేసి మీ అవసరాలకు.. వినియోగించుకుంటున్నారని.. ఇది తప్పు కాదా అని ప్రశ్నించారు. మంత్రి నారాయణకు .. పంట కాలువ భూమిని దోచిపెట్టడం అక్రమమని దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి అడ్డుకుంటుందని ఘాటుగా హెచ్చరించారు.

"దయనీయ స్థితిలో ప్రభుత్వ పాఠశాలలు"

గత వైసిపి ప్రభుత్వం లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కింద మొదటి దశలో 44 వేల ప్రభుత్వ పాఠశాలలను.. ఆధునికరించడం జరిగిందన్నారు. నాడు నేడు కింద ప్రభుత్వ.. పాఠశాలలకు నూతన తరగతి గదులు, ఫ్యాన్లు లైట్లు, RO వాటర్, డ్యూయల్ డెస్క్ బెంచెస్.. Ifp ప్యానెల్ బోర్డ్స్, విద్యార్థులకు టాబ్స్, అందించడం జరిగిందన్నారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పాఠశాలల్లో RO సిస్టం రిపేర్లకు నోచుకోక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. మొన్నటి రోజున ప్రత్యక్షంగా నేను నెల్లూరు వెంకటేశ్వరపురం పాలిటెక్నిక్ కళాశాలను.. సందర్శించినప్పుడు.. విద్యార్థుల ఇబ్బందులు తెలుసుకోవడం జరిగిందన్నారు.

విద్యార్థులకు తాగేందుకు కనీసం.. మంచినీరు అందక ఉన్న ఆర్వో సిస్టం పాడైపోవడంతో.. దానిని పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం నాడు నేడుకు పేరు మార్చి మనబడి పేరుతో..1500 కోట్లు ఇస్తామని చెప్పిఇప్పటికి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని ధ్వజమెత్తారు.

"కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ ను ఇష్టా రాజ్యాంగా వినియోగం"

CSR ఫండ్స్ అంటూ.. నాలుగు స్కూళ్ళను.. ఆధునికరిస్తే విద్యార్థులు సమస్యలు తీరిపోతాయేమో చెప్పాలన్నారు. కొన్ని స్కూళ్లలో మరమ్మత్తులు చేయడానికి.. కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ ను.. ఇష్టా రాజ్యాంగ వాడుకుంటున్నారని, ఈ హక్కు మీకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అన్ని రకాలకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలను విద్యాశాఖ కిందకు.. తీసుకువచ్చి.. కేవలం విద్యా శాఖ ద్వారా ఆయా పాఠశాలలకు నిధులు సమకూర్చి, అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు.

"భక్తి, దేవుడు అంటే అపార నమ్మకం గౌరవం"

నా రాజకీయ ప్రత్యర్థులు తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, నన్ను మాట్లాడకుండా , కేసులతో అణగదొక్కలని చూస్తున్నారని అన్నారు. DSC లో జరిగిన అన్యాయలకు సమాధానం చెప్పలేక కుల మతాల మధ్య విబేదాలు సృష్టిస్తున్నారని, ఇది అందరకీ తెలుసునని, నిజంగా నా వల్ల ఎవరు బాధపడిన బేషరుతుగా క్షమాపణ చెప్తానని అన్నారు...

ఒక పాట విషయంలో ఒక కార్యకర్త తన ఆవేదన వ్యక్తం చేస్తూ..అలా పాట పాడారే తప్ప.. ఎక్కడ మతాన్ని అవహేళన చేయడం వారి ఉద్దేశం కాదని, అక్కడ తాను ఉన్నప్పటికీ.. వారు పాడుతున్న పాటను తాను ఎక్కడా.. ఆలపించలేదని, మౌనంగా ఉన్నానని తెలిపారు ... కేవలం ఒక రాజకీయ కుట్రలో .. భాగంగానే ప్రభుత్వం తనపై అనేక తప్పుడు కేసులు పెడుతున్నారని . . ఎలాంటి కేసులు కైనా తాను భయపడేది లేదన్నారు. నేను ఒక హిందువుగా.. దేవుళ్ళను..పూజిస్తూ, ఆరాధిస్తూ .. భగవంతునికి..ఎంతో నిష్టగా కార్యక్రమాలు చేస్తూ ఉంటానన్నారు.

"రాజకీయంగా ఎదుర్కోలేకే నాపై కుట్రలు, కేసులు.."

తనపై రాజకీయ కక్షపూరితంగానే కేసులు నమోదు చేశారని..అన్నారు. గతంలో మంత్రి లోకేష్, తెలుగుదేశం పార్టీ,బిజెపి సభల్లో గోవింద నామాల పాటలను రాజకీయంగా ఏ విధంగా వాడుకున్నారో వీడియో ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఆరోజు ఈ కార్యక్రమాల వలన హిందువుల.. మనోభావాలు దెబ్బతిన్నాయని ఎక్కడా తాము ఎవ్వరి మీద కేసులు నమోదు చేయలేదన్నారు. కేవలం ఈ రోజు తనను రాజకీయంగా ఎదుర్కొనలేక ఈ విధంగా..కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తుందన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story