Nellore: బీసీ వర్గాల అభ్యున్నతే రాష్ట్ర అభ్యున్నతి: ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్!

Nellore: నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 21 Aug 2026 8:23 PM IST
Nellore
X

Nellore: బీసీ వర్గాల అభ్యున్నతే రాష్ట్ర అభ్యున్నతి: ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్!

నెల్లూరు: బీసీ వర్గాల అభ్యున్నత రాష్ట్ర అభివృద్ధిని భావించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో బీసీ వర్గాలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం సంతోషకర విషయం అని నెల్లూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అన్నారు. ఈ మేరకు శుక్రవారం నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

లోకేష్ ప్రతి ప్రాంతంలో బీసీ వర్గాల సమస్యలపై వారితో నేరుగా మాట్లాడుతూ పరిస్కరిస్తున్నారని చెప్పారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 12 సంవత్సరాలుగా బీసీ వర్గాలకు చెందిన నేతలే పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారని, కూటమి పార్టీల సమిష్టి నిర్ణయం మేరకు డిప్యూటీ సీఎం పదవిని పవన్ కళ్యాణ్ కి కేటాయించారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఐదు మంది ఉపముఖ్యమంత్రులు ఉంటే పేరుకే పదవులు ఉన్నాయని, పెత్తనం పై వారు చేశారని తెలిపారు.

వైసీపీ హయాంలో బలహీన వర్గాలు పనిచేసే పరిస్థితి లేదని, సకల శాఖామంత్రి కనుసన్నల్లోనే పరిపాలన సాగేదని పార్కొన్నారు. బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్ అడ్డుకోవాలని చూసింది ఎవరు? వైసీపీ కాదా.. రిజర్వేషన్ అడ్డుకునేందుకు వైసిపి కుట్రలు పన్నుతోందని, అందుకు నిదర్శనమే అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ అని అన్నారు.

స్వర్గీయ ఎన్టీ రామారావు శ్రీకారం చుట్టిన బీసీ సాధికారతను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనసాగిస్తున్నారని చెప్పారు... స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు అవకాశం ఇవ్వడం వల్లే ఎంపీటీసీలు, ఎంపీపీలు జడ్పీటీసీలుగా రాణిస్తున్నారని. బీసీలను గ్రామస్థాయి నుంచి పార్లమెంటు స్థాయికి ప్రోత్సహించిన ఘనత టిడిపిదే. బీసీలకు రిజర్వేషన్ పేటెంట్ హక్కు తెలుగుదేశం పార్టీదని చెప్పారు. అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి టిడిపి కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారని, అసలు తెలుగుదేశం పార్టీ నే బీసీలకు రిజర్వేషన్లు తీసుకురాకపోయుంటే అనిల్ కుమార్ యాదవ్ కార్పొరేటర్ గా పోటీ చేసేవారా? అని ప్రశ్నించారు. ఈ స్టేజి మీద ఉన్న ప్రతి ఒక్కరూ రిజర్వేషన్లను ఉపయోగించుకుని ఈ స్థాయికి ఎదిగిన వాళ్లమేనని చెప్పారు.

వైసిపి హయాంలో 16,800 మంది బీసీ నేతలు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకత్వం కోల్పోయారు. రాజకీయంగా నిరాదరణకు గురయ్యారని, 70 వేల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయలేకపోయారని చెప్పారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story