Nellore: వైసీపీ ది డైవర్షన్ పాలిటిక్స్ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర
Nellore: వైసీపీది డైవర్షన్ పాలిటిక్స్ అని, ఐదేళ్లలో జగన్ ఏ అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ధ్వజమెత్తారు.
Nellore: వైసీపీ ది డైవర్షన్ పాలిటిక్స్ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర
నెల్లూరు: వైసీపీ ది డైవర్షన్ పాలిటిక్స్ అని దుర్మార్గపు అక్రమ పాలనతో ప్రజలు ప్రతిపక్ష అవకాశం కూడా ఇవ్వలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర.
ఉత్తరాంధ్రని ఆర్ధిక రాజధానిగా తీర్చిదిద్దాలని, భోగాపురం ఎయిర్ పోర్ట్ ని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఛాలెంజ్ గా తీసుకుని పూర్తి చేశారని తెలిపారు... అయిదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఒక్కపని చేయలేదని,
వెలిగొండ ప్రాంత ప్రజలు మూడుసార్లు వైసీపీకి అధికారమిచ్చారని, ఓట్లు వేశారా? లేదా? అనే విషయాన్ని సీఎం చంద్రబాబు పట్టించుకోలేదని అన్నారు.
ఏ అభివృద్ది జరిగినా మేమే చేశాం... మేమే చేశాం... అంటూ క్రెడిట్ చోరీ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పారు... బీసీలకు34 శాతం రిజర్వేషన్ ఇస్తే గగ్గోలు పెడుతున్నారని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలపై ఉక్కుపాదం మోపారని అన్నారు ... ఇవాళ బీసీలకి తామేదో చేశామని అంటున్నారని, ఈ దేశంలోనే బీసీలని అన్ని విధాల ప్రోత్సహించింది ఎన్టీఆర్, చంద్రబాబు అని చెప్పారు.. . బీసీలని 45ఏళ్లుగా టీడీపీ ఆదరిస్తూ ఆదుకుంటుందని చెప్పారు..




