Vidavaluru: కోవూరులో 'రెండేళ్ల నమ్మకం' ఇంటింటి ప్రచారం!

Vidavaluru: విడవలూరు మండలం చౌకచర్లలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి 'రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం' ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 Aug 2026 9:49 AM IST
Vidavaluru
X

Vidavaluru: కోవూరులో 'రెండేళ్ల నమ్మకం' ఇంటింటి ప్రచారం!

Vidavaluru: విడవలూరు మండలం చౌకచర్ల పంచాయతీలో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ, రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు నడిపిస్తున్నారని అన్నారు.

అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించాలని, ప్రజల సమస్యలను తెలుసుకుని రాబోయే మూడేళ్లలో వాటిని పరిష్కరించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు.

కోవూరు నియోజకవర్గంలో ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ ఇంటింటి ప్రచారం దాదాపు 90 శాతం పూర్తయిందని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి నాయకుడు, కార్యకర్తకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story