Nellore: కండలేరు స్పిల్ వే వరద కాలువలను పరిశీలించిన సోమిరెడ్డి
Nellore: పొదలకూరు మండలం అంకుపల్లి పరిధిలోని కండలేరు స్పిల్వే వరద కాలువ పనులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Nellore: కండలేరు స్పిల్ వే వరద కాలువలను పరిశీలించిన సోమిరెడ్డి
Nellore: పొదలకూరు మండలం అంకుపల్లి పరిధిలోని కండలేరు స్పిల్వే వరద కాలువలో జరుగుతున్న పనులను పరిశీలించారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రూ.50 లక్షల వ్యయంతో జరుగుతున్న ఈ పనులు రైతులకు ఉపయోగపడేలా నాణ్యతతో కొనసాగుతున్నాయని, కూటమి ప్రభుత్వంలో ప్రతి పనిని పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నామని, పని ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు జీపీఎస్ ఫొటోలతో రికార్డు చేస్తూ పర్యవేక్షణ కొనసాగుతోందని, పనులు చేయకుండా బిల్లులు చెల్లించే పరిస్థితికి ఆస్కారం లేదని చెప్పారు.
ఇరిగేషన్ రంగంలో రైతుల భాగస్వామ్యంతో కాలువలు, చెరువుల పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని, ఎక్కడైనా అవకతవకలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో రాజీ ఉండదని అన్నారు. "సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న పనులు" రూ.108 కోట్లతో ఆర్డీఎస్ఎస్ విద్యుత్ త్రీఫేజ్ లైన్ పనులు, రూ.68.95 కోట్లతో జలజీవన్ మిషన్ కింద 250 తాగునీటి పనులు, రూ.50.28 కోట్లతో 4,450 మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ యూనిట్ల ఏర్పాటు, మొత్తంగా రూ.227 కోట్లకు పైగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, రైతులకు అవసరమైన సదుపాయాలు అందించడమే మా లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు సోమిరెడ్డి.




