Nellore: SEIL కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి సుదీర్ఘ చర్చలు!

Nellore: నెల్లూరు SEIL కంపెనీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

V. Narasimhulu, Nellore
Published on: 7 Jun 2026 7:42 AM IST
Nellore
X

Nellore: SEIL కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి సుదీర్ఘ చర్చలు!

నెల్లూరు: SEILకార్మికుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చొరవ తీసుకుని, కార్మికులకు న్యాయం జరిగేలా రెండు రోజులుగా విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో, నిన్న సీఐటీయూ నాయకులతో పాటు కార్మికులతో సమావేశమై వారి సమస్యలన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నెల్లూరు ఆర్&బీ అతిథి గృహంలో రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డితో పాటు, ఆర్డీఓ నాగ అనూష, డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, డిప్యూటీ లేబర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి తో కలసి సీఐటీయూ నాయకులు గోగుల శ్రీనివాసులు.

అజయ్ కుమార్, కార్మికుల ప్రతినిధులతో చర్చలు జరిపారు. సాయంత్రం SEIL కంపెనీ ప్రతినిధులతో సమావేశమై పలు సమస్యల పరిష్కారానికి ఒప్పించిన సోమిరెడ్డి..మిగిలిన సమస్యల పరిష్కారం దిశగా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story