Venkatagiri: అంగన్‌వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు, కుక్కర్ల పంపిణీ!
Venkatagiri: వెంకటగిరిలో పోషణ్ అభియాన్ వేడుకల్లో 261 అంగన్‌వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు, కుక్కర్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ.
Venkatagiri: అంగన్‌వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు, కుక్కర్ల పంపిణీ!
Venkatagiri: ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం, పింజల వీరయ్య కళ్యాణ మండపంలో జరిగిన "పోషణ్ అభియాన్" మరియు అంగన్‌వాడీల సాధికారత కార్యక్రమంలో ముఖ్య అతిథిగాఎమ్మెల్యే రామకృష్ణ పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలకు 261 ఇండక్షన్ స్టవ్‌లు, ప్రెషర్ కుక్కర్లు పంపిణీ చేశారు. అనంతరం పలువురు చిన్నారులకు తన చేతుల మీదుగా అన్నప్రాసన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ...
గత ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలను తీవ్రంగా మోసం చేసిందని మండిపడ్డారు. గతంలోనారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీల జీతాలు రూ. 4,500 నుంచి రూ. 7,500కి, ఆ తర్వాత రూ. 10,500 కు పెంచారని గుర్తుచేశారు. కానీ గత ఐదేళ్ల పాలకులు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి, గొప్పలు చెప్పుకున్నారని, అంగన్‌వాడీలకు ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వలేదని విమర్శించారు..
"రూ. 57 లక్షలు నిధులు ఒక్కో అంగన్‌వాడీ కేంద్రం కు లక్ష తో ఆధునికీకరణ"
చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలోని 51 అంగన్‌వాడీ కేంద్రాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.




