Nellore: ధగధగలాడుతున్న రాజరాజేశ్వరి ఆలయ ధ్వజస్తంభం - భక్తుల తన్మయత్వం

Nellore: నెల్లూరు శ్రీ రాజరాజేశ్వరి ఆలయ ధ్వజస్తంభానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతుల సౌజన్యంతో బంగారు తాపడం చేయించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 April 2026 4:04 PM IST
Nellore
X

Nellore: ధగధగలాడుతున్న రాజరాజేశ్వరి ఆలయ ధ్వజస్తంభం - భక్తుల తన్మయత్వం

Nellore: నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతుల సౌజన్యంతో నెల్లూరు రూరల్ పరిధిలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ధ్వజస్తంభ బంగారు తాపడం సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. గురువారం ఉదయం వేద మంత్రోచరణల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ దంపతులు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ఆలయానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆహ్వానం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న వేమిరెడ్డి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొని యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించారు. అనంతరం బంగారు తాపడం చేయించిన ధ్వజస్తంభాన్ని ఆవిష్కరించగా ధగధగ మెరుపులతో అద్భుతంగా దర్శనమిచ్చింది. భక్తులు తన్మయత్వం చెందారు.

ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులు మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో ఆలయ ధ్వజస్తంభానికి బంగారు తాపడం చేయించడం తమ అదృష్టం అన్నారు. అమ్మవారి దయతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గతేడాది జులైలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట చేపట్టామని, 8 నెలలకే ధ్వజ స్తంభానికి బంగారు తాపడం చేయించడం హర్షనీయమన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు. నెల్లూరు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని వారు ఆకాంక్షించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ ధ్వజ స్తంభానికి బంగారు తాపడం చేయించిన వేమిరెడ్డి దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. స్వామివారి కటాక్షం వారిపై ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఆలయ ఈఓ, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story