Nellore: సూపర్ సిక్స్ సూపర్ హిట్: నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి
Nellore: నెల్లూరు రూరల్ 21వ డివిజన్‌లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించి, సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
Nellore: సూపర్ సిక్స్ సూపర్ హిట్: నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి
సూపర్ సిక్స్ సూపర్ హిట్..అభివృద్ధి మరియు సంక్షేమంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరుగులు"
నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21 వ డివిజన్ ఉమ్మారెడ్డి గుంటలో రెండేళ్ల నమ్మకం అభివృద్ధి - సంక్షేమం ఇంటింటి ప్రచార" కార్యక్రమంలో పాల్గొని రెండేళ్లలో చేసిన అభివృద్ధిని మరియు సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..
రెండేళ్లలో ఏమి చేశామో ప్రజల దగ్గరకు వెళ్లి గర్వంగా చెప్పగలుగుతున్నామని,
ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేరుగా నాకు ఫోన్ చెయ్యండి. మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
రాబోయే 3 సంవత్సరాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి కంటే సాయి బాబా ,కో క్లస్టర్ ఇంచార్జి కోటిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు చాంద్ బాషా, టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




