Allur: అల్లూరు మండలానికి తలమానికంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం!

Allur: నెల్లూరు జిల్లా ఇందుపూరులో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన.

V. Narasimhulu, Nellore
Published on: 9 May 2026 4:58 PM IST
Allur
X

Allur: అల్లూరు మండలానికి తలమానికంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం!

అల్లూరు: నెల్లూరు జిల్లా, అల్లూరు మండలం, ఇందుపూరు గ్రామంలో వెలిసిన శ్రీశ్రీశ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి వారి ఆలయ పునః నిర్మాణ శంఖుస్థాపన కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి నియోజకవర్గశాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి లతో కలిసి హాజరయ్యారు శాసనమండలి సభ్యులు, టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర.

విచ్చేసిన పెద్దలకు ముందుగా ఆలయ అర్చకులు మంగళవాద్యాలు, పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు నిర్వహించిన ప్రత్యేక పూజలలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద రవిచంద్ర, కావ్య కృష్ణారెడ్డి పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ...

శ్రీ శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణ కార్యక్రమానికి రావడం చాలా సంతోషదాయకమని పేర్కొన్నారు. అల్లూరు మండలానికి తల మానికంగా ఇందుపూరు గ్రామంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం రూపుదిద్దుకుంటుందని, ఆలయ నిర్మాణానికి అన్ని విధాలా తమ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. ఆలయ నిర్మాణంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా త్వరగా పూర్తి కావాలని, గ్రామ ప్రజలందరూ స్వామివారి ఆశీస్సులు పొందాలని ప్రార్ధించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story