Nellore: సీతారామపురం మెగా పేరెంట్స్ మీటింగ్‌లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్
Nellore: జిల్లా సీతారామపురంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్. విద్యార్థుల విద్యాభివృద్ధి, నైతిక విలువలపై కీలకోపన్యాసం.
Nellore: సీతారామపురం మెగా పేరెంట్స్ మీటింగ్‌లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్
నెల్లూరు జిల్లా: సీతారామపురం మండలంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్‌లో స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. చిన్ననాటి నుంచే పిల్లల్లో క్రమశిక్షణ, సత్ప్రవర్తన, నైతిక విలువలు అలవర్చాలని సూచించారు. చదువులో మంచి ప్రతిభ కనబరచడంతో పాటు సమాజం పట్ల బాధ్యత, పెద్దల పట్ల గౌరవం, దేశభక్తి, మానవీయ విలువలను కూడా విద్యార్థులు పెంపొందించుకోవాలని కోరారు. పాఠ్యాంశాల బోధనతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యతలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను కోరారు. పిల్లల విద్యాభివృద్ధిపై తల్లిదండ్రులు నిరంతరం శ్రద్ధ చూపడంతో పాటు పాఠశాలలతో సమన్వయం చేసుకుంటూ వారి పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థుల విద్యా పురోగతి, బోధన విధానాలపై ఉపాధ్యాయులతో ఎమ్మెల్యే చర్చించి పలు సూచనలు చేశారు.




