Kavali: కావలి రూ.35 కోట్లతో 6 లైన్ల రోడ్ విస్తరణకు శ్రీకారం
Kavali: కావలిలో రూ.35 కోట్ల వ్యయంతో 6 లైన్ల ట్రంక్ రోడ్ విస్తరణకు ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి శంకుస్థాపన. పట్టణ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం.
Kavali: కావలి రూ.35 కోట్లతో 6 లైన్ల రోడ్ విస్తరణకు శ్రీకారం
కావలి: పట్టణ అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. ట్రంక్ రోడ్‌లోని స్వర్గీయ కలికి యానాదిరెడ్డి విగ్రహం వద్ద నుంచి ముసునూరు హైవే,వరకు అయ్యప్ప స్వామి ఆలయం సమీపం వరకు 6 లైన్ల ట్రంక్ రోడ్ విస్తరణ పనులకు నేడు శంకుస్థాపన చేశారు.
సుమారు రూ.35 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రతిష్ఠాత్మక రహదారి విస్తరణ పనులకు కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ట్రంక్ రోడ్ విస్తరణతో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు, పట్టణంలో రాకపోకలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కావలి పట్టణానికి మరింత అందం చేకూరడంతో పాటు అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




