Dagadarthi: టీడీపీ నేత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే!

Dagadarthi: అనారోగ్యంతో మృతి చెందిన దగదర్తి టీడీపీ నాయకుడు తాళ్లూరు వెంకటేశ్వర నాయుడు కుటుంబాన్ని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పరామర్శించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 7 Aug 2026 8:12 AM IST
Kavali
X

Kavali: టీడీపీ నేత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే!

Dagadarthi: "తెలుగుదేశం కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కావలి ఎమ్మెల్యే దగుమాటి"

అనారోగ్యంతో మృతి చెందిన దగదర్తి తెలుగుదేశం పార్టీ నాయకులు తాళ్లూరు వెంకటేశ్వర నాయుడు (72) కుటుంబాన్ని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, గురువారం దగదర్తి గ్రామంలోని వారి ఇంటికి విచ్చేసి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతి చెందిన వెంకటేశ్వర్లునాయుడు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

వెంకటేశ్వర్లు నాయుడు కుమారుడు NRI తాళ్లూరి హరికృష్ణతో మాట్లాడారు... ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట తెలుగుదేశం పార్టీ దగదర్తి మండల ఇంచార్జ్ పమిడి రవికుమార్ చౌదరి, మండల కన్వీనర్ అల్లం హనుమంతరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు గున్నంరెడ్డి హరి కిషోర్ రెడ్డి, పాపనబోయిన మల్లికార్జున్ రెడ్డి, మారు బోయిన వేణుగోపాల్, వడ్డే శ్రీకాంత్ నాయుడు, వడ్డే వినయ్ కుమార్, కడియాల వెంకట సురేష్, కంచర్ల వెంకటేశ్వర్లు, ముప్పాళ్ళ తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story