Nellore: జవాన్ పగడాల రవి మిస్సింగ్: ప్రభుత్వాల అలసత్వంపై కాంగ్రెస్ ఆగ్రహం

Nellore: నెల్లూరు జిల్లా ఆర్మీ జవాన్ పగడాల రవి అదృశ్యమై 40 రోజులు దాటినా ఆచూకీ లభించకపోవడంపై కాంగ్రెస్ నాయకుడు సోము అనిల్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

A Praveen, Nellore
Published on: 29 Aug 2026 11:57 AM IST
Nellore
X

Nellore: జవాన్ పగడాల రవి మిస్సింగ్: ప్రభుత్వాల అలసత్వంపై కాంగ్రెస్ ఆగ్రహం

Nellore: నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు మండలం, తోటల చెరువుపల్లి గ్రామానికి చెందిన మిలటరీ సైనికుడు పగడాల రవి అదృశ్యమై నేటికి 40 రోజులు గడుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం దారుణమని ఉదయగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సోము అనిల్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శుక్రవారం నెల్లూరులోని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో విరోచితంగా సేవ చేస్తున్న ఆర్మీ జవాన్ పగడాల రవి 40 రోజుల క్రితం అదృశ్యమైతే ఇప్పటివరకు పోలీసు శాఖ, ఆర్మీ అధికారుల నుంచి కుటుంబానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జవాన్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నారుగా రోధిస్తున్నారని ప్రభుత్వం మానవత్వంతో స్పందించి వెంటనే ఆచూకీ కనుగొనాలని డిమాండ్ చేశారు.

ఈ కేసులో అనేక అనుమానాలు ఉన్నాయని ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.జవాన్ ఆచూకీ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని, ఆర్మీ జవాన్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్మీ జవాన్ పగడాల రవి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్ ను మరియు రాష్ట్ర డిజిపిని కలుస్తామని తెలిపారు. జవాన్ రవి పిల్లలు మా నాన్న ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడు వస్తాడు? అని అడిగే మాటలకు చూపరుల మనసులను కలిసి వేస్తుందని సోము అనిల్ కుమార్ భావోద్వేగానికి లోనయ్యారు. జవాన్ పగడాల రవి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, తెలియజేశారు.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story